'ఉపా'కు తగ్గిన వ్యతిరేకత
న్యూఢిల్లీ: భారత దేశం ఎన్నికల రాజకీయాల్లో ఒక కొత్త శకం ప్రారంభం కానుంది. అధికార కేంద్రానికి, అధికార పార్టీ పట్ల వ్యతిరేకత గతంలో కంటే బాగా తగ్గినట్లు పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. దాంతో అధికార పార్టీ అభ్యర్ధులు, అధికారంలో కొనసాగిన నాయకులకు ఎన్నికల్లో తిరిగి గెలిచే అవకాశాలు పెరిగినట్లు ఆ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పలు నియోజక వర్గాల ప్రజల పేదరికం స్థాయిలు గణనీయంగా క్షీణించడంతో అధికార పార్టీపై ప్రజల్లో అసంతృప్తి బాగా ఉపశమించిందని రెండు రకాల డేటాలు తెలియజేస్తున్నాయి.
గత అయిదేళ్లలో దేశంలోని 543 లోక సభ స్థానాలకు గాను దాదాపు 380 స్థానాల్లో పేదరికం తగ్గినట్లు ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ (ఈపిడబ్ల్యూ) అధ్యయనం తెలియజేస్తోంది. దాంతో అధికార పార్టీ పట్ల ప్రజల్లో నెలకొన్న వ్యతరేకత ఉపశమించిందని తెలుస్తోంది. దాంతో అదికార పార్టీ అభ్యర్ధులు గెలుపు గుర్రంపై సవారీ చేసే అవకాశాలు పెరిగినట్లు ఆ అధ్యయనం వెల్లడించింది. 2004-08 మధ్యకాలంలో అధికార పార్టీ వ్యతిరేక ధోరణి గణనీయంగా తగ్గిపోయినట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో జరిగిన 5 అసెంబ్లీ ఎన్నికల్లో 3 అసెంబ్లీల్లో అధికార పక్షమే గెలుపొందడంతో ఆ విషయం తేటతెల్లమైనట్లు ఈపిడబ్ల్యూ అధ్యయనం వెల్లడైంది.
Pages: 1 -2- -3- News Posted: 27 March, 2009
|