'ఉపా'కు తగ్గిన వ్యతిరేకత
2004 నుండి 2008 మధ్యకాలంలో దారిద్ర్య రేఖ దిగువనున్న జనాభా (బిలో పావర్టీ లైన్-బిపిఎల్) 28 శాతం నుండి 26 శాతానికి పడిపోయింది. అదే కాలంలో, ఉత్తరాఖండ్ మినహాయించి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బిపిఎల్ జనాభా గణనీయంగా తగ్గిపోయింది. ఉత్తరాఖండ్ బిపిఎల్ జనాభా మాత్రం 2004లో 43 శాతం నుండి 2008 47 శాతానికి పెరిగింది. 2004 వరకు ఒరిస్సా రాష్ట్రంలో దేశంలో అత్యధిక బిపిఎల్ జనాభా గల రాష్ట్రంగా ఉండేది 2004 లో 46 శాతంగా ఉన్న ఒరిస్సా బిపిఎల్ జనాభా 2008 నాటికి 45 శాతానికి క్షీణించింది. మిజోరం బిపిఎల్ జనాభా కేవలం ఒక్క శాతం మాత్రమే. ఈ అయిదేళ్లలో అస్సాం బిపిఎల్ జనాభా నాలుగు శాతం క్షీణించింది. అస్సాం అధికార పార్టీ ఈ పరిస్థిత బాగా అనుకూలిస్తుంది.
నేషనల్ సాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ కు సంబంధించిన 50, 55వ, 61వ నియోజవర్గాల వారీ సర్వే ఫలితాలను బట్టి పై అంచనాలకు రావడం జరిగింది. బిపిఎల్ జనాభా తగ్గిన దేశంలోని 10 అత్యున్నత నియోజక వర్గాలు ఉత్తర భారత దేశంలోనే ఉన్నాయి. ఒక్క ఉత్తర ప్రదేశ్ నుండి ఆరు నియోజక వర్గాలు ఈ 10 అత్యున్నత నియోజక వర్గాల జాబితాలో ఉన్నాయి. ఒరిస్సా ఆస్కా నియోజకవర్గంలో బిపిఎల్ జనాభా 10 శాతం తగ్గడం విశేషం. అయితే విచిత్రమేమంటే సోనియా గాంధీ నియోజక వర్గంలో బిపిఎల్ జనాభా శాతం పెరిగింది. ఏది ఏమైనా దేశ వ్యాప్తంగా మెజారిటీ నియోజవర్గాల్లో తగ్గిన బిపిఎల్ జనాభా ఎన్నికల్లో ఉపా పక్షానికి అనుకూలతగా మారుతుంది.
Pages: -1- -2- 3 News Posted: 27 March, 2009
|