'ఉపా'కు తగ్గిన వ్యతిరేకత
2004 ఎన్నికల్లో దాదాపు మూడింట రెండు వంతుల మంది లోకసభ్యులు ఓటమి పాలైనారు. అయితే ఈసారి వారి గెలుపు అవకాశాలు బాగా పెరిగినట్లు ఆ అధ్యయనం తెలిపింది. 380 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో క్షీణించిన పేదరికాన్ని ప్రామాణింకంగా తీసుకున్నట్లయితే ఆ నియోజక వర్గాల కాంగ్రెస్ అభ్యర్ధులకు, వారి మిత్రపక్షాలకు ప్రజాభీష్టం అనుకూలంగా ఉంటుంది. పేదరికం స్థాయి తగ్గిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన 84 మంది ప్రజాప్రతినిధులుండగా, ఆర్ జెడికి 17 మంది, ఎన్ సిపికి ఆరుగురు, ఎస్ పికి 16 మంది, బిజెపికి 65 మంది, లెఫ్ట్ ఫ్రంట్ కు 31 మంది, బిఎస్ పికి 10 మంది ప్రజాప్రతినిధులున్నారు. నియోజక వర్గాల వారీగా దాదాపు రెండు డజన్లకు పైగా జనాభా, సామాజిక, ఆర్ధిక అభివృద్ది సూచిక ఆధారంగా ఎకానమిక్ టైమ్స్-ఇండికస్ అనాలటిక్స్ ఎలక్షన్ స్పెషల్ అంచనా వేసింది.
లోక్ సభ భవితవ్యం ఏడాది ముందుగా జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిబింబించడం సహజంగా జరుగుతుంది. ఎన్నికల ఫలితాలకు, ఒకేఒక అభివృద్ధి అంశంతో ముడిపెట్టి నిర్ణయించడం సరైనది కనప్పటికీ, ఈ అనుసంధానం కొంత వాస్తవికతకు కొంత దగ్గరగా ఉండటంలో సందేహించాల్సిన అవసరం లేదు. పేదిరకం క్షీణించడమనే విషయం ఎన్నికల్లో తిరిగి నెగ్గడానికి మరిన్ని అవకాశాలు కల్పిస్తుంది. 2004-2008 మధ్యకాలంలో పేదరికం స్థాయిలు నిలకడగా ఉన్న లేదా బాగా పెరిగిన నియోజకవర్గాల్లో అధికార పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. గత అయిదేళ్లుగా దాదాపు 51 నియోజకవర్గాల్లో పేదరికం స్థిరంగా ఉంది. 112 నియోజకవర్గాల్లో పేదరికం బాగా పెరిగినట్లు అంచనాలు చెబుతున్నాయి. ప్రజలు దినసరిగా వినియోగించే ఆహార పదార్ధాల కేలరీ శక్తి పై ఆధారపడి ప్రభుత్వం పేదరికాన్ని అంచనా వేస్తుంది. పట్టణ ప్రాంత పేద ప్రజలు రోజుకు సగటున 2,400 కేలరీల శక్తిని ఖర్చు చేస్తుంటే, గ్రామీణ ప్రాంత ప్రజలు 2,100 కేలరీల శక్తిగల ఆహారాన్ని తీసుకుంటున్నారు.
Pages: -1- 2 -3- News Posted: 27 March, 2009
|