ఇండిపెండెంట్లదే పైచేయి?
రెండు నెలల ముందే వికలాంగుల పెన్షన్ ను 500 రూపాయలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. ఇది ఎన్నికల వాగ్దానంగానే మిగిలిపోయింది. వృద్ధులకు ఇస్తున్న 200 రూపాయల పెన్షన్ ను 500 రూపాయలకు పెంచడానికి ప్రజారాజ్యం, తెలుగుదేశం పార్టీలు హామీ ఇచ్చాయి. వీటితో పాటు ఉచిత విద్య, వైద్య సదుపాయం కల్పిస్తామంటున్నాయి. కిలో రెండు రూపాయల బియ్యాన్ని ఉచితంగానే పంపిణీ చేస్తామంటున్నాయి. వైఎస్ ప్రభుత్వం ఇ్చిన హామీల్లో రైతులకు ఉచిత విద్యుత్ ను మాత్రమే గత ఐదేళ్లుగా అమలు చేయగలిగింది. సంక్షేమ పథకాల ప్రభావం ఓటర్లపై కనిపించకపోవడంతో స్వతంత్రులకు కూడా విజయావకాశాలపై ధీమా పెరిగింది. నియోజకవర్గంలో తమకున్న ప్రజాబలాన్ని ప్రదర్శిస్తే ప్రధాన పార్టీలు వారి ముంగిట వాలే ్వకాశాలేర్పడ్డాయి. గత ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నుంచి కాంగ్రెస్ టిక్కెట్ దక్కని పిల్లి సుభాష్ చంద్ర బోస్ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీకి దిగారు. తన బలాన్ని ప్రదర్శించి, విజయం సాధించారు.
పాలకులు ఆయన్ను తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఏకంగా మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు. దీంతో స్వతంత్రులకుకూడా భవిష్యత్ పై భరోసా పెరిగింది. టిక్కెట్లు రానంత మాత్రాన నిరాశకు గురికావలసిన పనిలేదని తేలిపోయింది. మూడు పార్టీల మధ్య పోరాటంలో ఏ పార్టీకి తగిన మెజారిటీ లభించిందని ఇప్పటికే సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గెలిచి వచ్చిన స్వతంత్రుల కూటమే ప్రభుత్వ ఏర్పాటును నిర్దేశించనుంది.
Pages: -1- 2 News Posted: 31 March, 2009
|