ప్రైవేట్ జెట్ నయం
అమెరికాలో నిర్వహించిన విమానయాన పరిశోధన సర్వే ప్రకారం, గత మూడు నెలలలో పత్రికలు, ఆన్ లైన్ మీడియాలో విమానాలకు సంబంధించి 23,657 ప్రకటనలు వెలువడ్డాయి. వాటి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దాదాపు 20 శాతం ప్రకటనలలో విమానాలు లేదా హెలికాప్టర్ల విడిభాగాలను అమ్మనున్నట్లు తెలియజేశారు. మరి కొన్ని నెలలపాటు కొనుగోలుదారులు రాకపోతే ఆ విమానాలను హంగర్లలో నిలిపి ఉంచడానికి బదులు తుక్కు వస్తువుల జాబితాలో చేరిపోవచ్చు. ప్రతి ఐదు బిజినెస్ జెట్ విమానాలలో ఒకటి అమ్మకానికి ఉందని, 'ధరలు అంతకంతకు పతనం అవుతున్నాయి. అమ్మకానికి ఉద్దేశించిన, వాడిన విమానాల ఇన్వెంటరీలు రికార్డు స్థాయిలో అధికంగా ఉన్నాయి' అని విమానయాన కన్సల్టెంట్ బ్రియాన్ ఫోలీని ఉటంకిస్తూ నార్త్ జెర్సీ డాట్ కామ్ వెబ్ సైట్ లోని ఒక వ్యాసం తెలియజేసింది.
ఒక మెడికల్ బిల్లింగ్ కంపెనీ ప్రెసిడెంట్ డేవిడ్ రోజెన్ బ్లుమ్ ఇటీవల 1957 నాటి రెండు ఇంజన్ల ఏరో కమాండర్ విమానాన్ని కొనుగోలు చేశారు. దానికి తాను ఎంత చెల్లించిందీ రోజెన్ బ్లుమ్ నార్త్ జెర్సీడాట్ కామ్ కు తెలియజేయలేదు. కాని, 'కొనుగోలు ధర ఇంజన్ల ఓవరాలింగ్ వ్యయం కన్నా తక్కువే' అని ఆయన పేర్కొన్నారు. కొత్త, వాడిన విమానాల అమ్మకాలు, కొనుగోలు వ్యాపారంలో పేరొందిన సంస్థలలో ఒకటైన ప్లేన్ చెక్ తన వెబ్ సైట్ లో ప్రపంచవ్యాప్తంగా అమ్మకానికి సిద్ధంగా ఉన్న 1691 విమానాల గురించి వివరించింది. అమ్మకానికి వస్తున్న విమానాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండగా వాటి గురించి వాకబు చేసేవారి సంఖ్య అంతంతమాత్రంగా ఉండడం విశేషం.
Pages: -1- 2 -3- News Posted: 6 April, 2009
|