ప్రైవేట్ జెట్ నయం
మార్చి 30న ఈ వెబ్ సైట్ 1681 విమానాలను అమ్మకానికి సూచించగా 1460 మంది ఆన్ లైన్ సందర్శకులు ఉన్నట్లు తెలియజేసింది. మూడు రోజుల తరువాత అమ్మకానికి పెట్టిన విమానాల సంఖ్య 1691కి పెరగగా సందర్శకుల సంఖ్య 368గా మాత్రమే ఉంది. ప్లేన్ చెక్ సంస్థతో పాటు 800 పైగా విమానాలను అమ్మకానికి సూచించిన పెద్ద సంస్థలలో ఏవియేషన్ బిజినెస్ ఇన్ కార్పొరేషన్ వంటివి ఉన్నాయి. సి అండ్ ఎస్ ఎంటర్ ప్రైజెస్ వద్ద నూటికి పైగా, యుఎస్ఎ ఎయిర్ క్రాఫ్ట్ బ్రోకర్స్ ఇన్ కార్పొరేషన వద్ద సుమారు 80 విమానాలు అమ్మకానికి ఉన్నాయి.
అయితే, ప్రతి ఒక్కరు విమానాన్ని అమ్ముతున్నప్పుడు మనం ఎందుకు కొనుగోలు చేయాలనేదే ప్రశ్న. బ్యాంక్ ఆఫ్ అమెరికా నుంచి సిటీగ్రూప్, స్టార్ బక్స్ వరకు భారీ సంస్థలు గుత్తగా ప్రైవేట్ జెట్ విమానాలను అమ్మకానికి పెట్టాయి. ఫిబ్రవరి మొదటి వారంలో బ్యాంక్ ఆఫ్ అమెరికా మూడు కార్పొరేట్ లగ్జరీ జెట్ విమానాలను, ఒక హెలికాప్టర్ ను విక్రయించింది. గత డిసెంబర్ లో ఈ బ్యాంకు వద్ద నాలుగు గల్ఫ్ స్ట్రీమ్ లతో సహా తొమ్మిది కార్పొరేట్ జెట్ విమానాలు ఉన్నాయి. మెరిల్ లించ్ ఒక బొంబార్డియర్ గ్లోబల్ ఎక్స్ ప్రెస్ విమానాన్ని కొనుగోలు చేసింది. 'వాడిన విమానాన్న చౌకగా కొనుగోలు చేయడం తేలిక. కాని వీటిని నిర్వహించడం, నడపడం ఖరీదైన వ్యవహారం. అధిక పార్కింగ్ చార్జీలు, ఇంధన ఖర్చులు, పైలట్ల జీతాలు మరీ భారంగా ఉంటాయి' అని ఢిల్లీలో ఒక ప్రముఖ పారిశ్రామిక సంస్థకు చెందిన సీనియర్ ఏవియేషన్ ఎగ్జిక్యూటివ్ ఒకరు వ్యాఖ్యానించారు. 'ప్రతి విమానానికి మేము కనీసం ఇద్దరు పైలట్లను, ఇద్దరు ఇంజనీర్లను నియోగించవలసి ఉంటుంది. మేము ఎంత ఖర్చు చేయవలసి ఉంటుందో మీరే ఊహించుకోండి' అని ఆయన అన్నారు.
Pages: -1- -2- 3 News Posted: 6 April, 2009
|