పార్టీలకు ఐటి సమస్య
2001-06 కాలానికి సంబంధించిన బిజెపి బ్యాలెన్స్ షీట్ల ప్రకారం పార్టీ ఆ సమయంలో 'గుజరాత్ సహాయ నిధి' కింద రూ. 2.68 కోట్ల మేరకు నిధులు సేకరించింది. కాని వాటిలో నుంచి ఒక్క పైసాను కూడా సహాయ కార్యక్రమాల నిమిత్తం ఖర్చు చేయలేదు. అంతే కాదు. 2005-06 ఆర్థిక సంవత్సరంలో బిజెపి నికర సంపద రూ. 102.70 కోట్లలో ఈ సహాయ నిధి కూడా భాగమేనా అనేది స్పష్టం కావడం లేదు. మరి కాంగ్రెస్ పార్టీపై రెండు ఐటి కేసులు పెండింగ్ లో ఉన్నాయి. కాంగ్రెస్ నాయకత్వంలో ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) 2004లో అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిలో ఒకటి, అంటే విదేశీ విరాళాలకు పార్టీ కోరిన మినహాయింపునకు సంబంధించిన పదేళ్ళనాటి కేసుపై ఐటి (అప్పీళ్ళ) కమిషనర్ 2004 డిసెంబర్ 7న నిర్ణయం ప్రకటించారు. ఆ నిర్ణయం కాంగ్రెస్ కు అనుకూలంగానే వెలువడింది. తనకు 1994-95 సంవత్సరంలో రూ. 2.5 కోట్ల మేరకు, 1995-96 సంవత్సరంలో రూ. 25 లక్షల మేరకు అందిన విదేశీ విరాళాలను ఐటి నుంచి మినహాయించాలని పార్టీ అభ్యర్థించింది. అసెసింగ్ ఆఫీసర్ ఆ మినహాయింపు ఇవ్వడానికి నిరాకరించారు.
2001-02 సంవత్సరపు బ్యాలెన్స్ షీట్ ప్రకారం అసెసింగ్ ఆఫీసర్ ఆ రెండు విరాళాలపై పన్ను డిమాండ్లను వరుసగా రూ. 1.80 కోట్లు, రూ. 14.79 లక్షల మేరకు పెంచినట్లు విదితం అవుతోంది. విచిత్రంగా కాంగ్రెస్ రిటర్న్ లలో ఈ మొత్తాలను ఎవరు విరాళంగా ఇచ్చారో పేర్కొనలేదు. 2002-03లో బిజెపి నాయకత్వంలోని ఎన్ డిఎ ఇంకా అధికారంలో ఉన్నప్పుడు అసెసింగ్ ఆఫీసర్ ఈ విరాళాలపై పన్ను డిమాండ్లను వరుసగా రూ. 2.57 కోట్లు, రూ. 18.12 లక్షల మేరకు పెంచారు. కాంగ్రెస్ తిరిగి ఐటి (అప్పీళ్ళ) కమిషనర్ కు అప్పీల్ చేసుకున్నది. తాను తిరిగి అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే కాంగ్రెస్ తనకు అనుకూలంగా ఉత్తర్వున సంపాదించింది.
ఇక సిపిఎం 2003, 2007 సంవత్సరాల మధ్య రూ. 27.70 లక్షల మేరకు మాత్రమే విరాళాలు అందినట్లు ఎన్నికల కమిషన్ (ఇసి)కి తెలియజేసింది. అంటే ఈ పార్టీ దేశంలోని నిరుపేద జాతీయ పార్టీలలో ఒకటి అయిందన్నమాట. రాజకీయ పార్టీలు ఇసి వద్ద వెల్లడి చేసిన విరాళాలకు సంబంధించిన వార్తలను డిఎన్ఎ వరుసగా ప్రచురించింది కూడా.
Pages: -1- 2 -3- News Posted: 6 April, 2009
|