పార్టీలకు ఐటి సమస్య
అయితే, దేశంలోని సంపన్న పార్టీలలో సిపిఎం ఒకటి. సిపిఎం రిటర్న్ ల ప్రకారం, 2001, 2006 మధ్య పార్టీకి అందిన విరాళాలు మొత్తం రూ. 84.84 కోట్లు. వాటిలో చాలా వరకు విరాళాలు ఒక్కొక్కటి రూ. 20 వేల లోపే ఉన్నాయి. సిపిఐకి సంబంధించి ఐటి రిటర్న్ లు కొన్ని ఇబ్బందికర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సిపిఐ నాయకులు లక్షల రూపాయలు విలువ చేసే ప్రైవేట్ ఈక్విటీ వాటాలు పెక్కింటిని కొనుగోలు చేసినట్లు పార్టీ ఆడిటర్ పుణెకు చెందిన పిజి భగవత్ చార్టర్డ్ అకౌంటెంట్స్ సంస్థ వెల్లడి చేసింది. అయితే, ఏ సిపిఐ నాయకుల పేర్లపై వాటాలు కొనుగోలు చేసిందీ ఆడిటర్లు వెల్లడించలేదు. ప్రైవేట్ సంస్థలలో ముంబైకి చెందిన రెండు సంస్థలు తమ వ్యాపారాన్ని మూసివేసినట్లు చూపించడం ఈవిషయంలో మరింతగా అనుమానాలను రేకెత్తిస్తున్నది. ఇది ఇలా ఉండగా, మాయావతి నాయకత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్ పి) నిధులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. పార్టీ దాఖలు చేసిన ఐటి రిటర్న్ ల ప్రకారం, పార్టీ సంపద 2001-02లోని రూ. 11 కోట్ల నుంచి 2005-06లో రూ. 44 కోట్లకు పెరిగింది. 2002-03లో బిఎస్ పి ఆదాయంలో అధిక భాగం రూ. 22.32 కోట్ల మేరకు స్వచ్ఛంద విరాళాల రూపంలో సమకూరింది. పార్టీకి 2001, 2006 మధ్య అందిన విరాళాల మొత్తం రూ. 31 కోట్లు. పార్టీకి మరొక ప్రధాన ఆదాయ వనరు సభ్యత్వ రుసుము. పార్టీకి 2001-06 కాలంలో ఈ రుసుముగా రూ. 22.70 కోట్లు సమకూరాయి.
Pages: -1- -2- 3 News Posted: 6 April, 2009
|