విడిపోతున్న హృతిక్-సుజానే?
రెండ్నెల్లుగా...
హృతిక్-బార్బరా వ్యవహారం గత రెండు నెలలకు పైనుంచే పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశమమవుతోంది. 'కైట్స్' చిత్రం గత షెడ్యూల్ ముంబైలో జరిగినప్పటి నుంచి వీరు మరింత దగ్గరవుతూ వచ్చారు. బార్బారాతో పాటు ఆమె తల్లి, సోదరుడు...ఇలా ఆమె కుటుంబ సభ్యులందరికీ హృతిక్ బాగా దగ్గరవుతూ వస్తున్నారు. బార్బరా కోసం లోనావాలా సమీపంలోని ఆంబే వ్యాలీ ట్రిప్ ను కూడా హృతిక్ ఎరేంజ్ చేశారు. అయితే తన భార్యను మాత్రం హృతిక్ దూరం పెట్టారు. హృతిక్, సుజానే జంట పబ్లిక్ లోకి వచ్చి చాలా నెలలే అయిందనీ, నిజానికి అమృతా అరోరా పెళ్లికి ఈ ఇద్దరూ కలిసి వచ్చినప్పుడే వీరు ఎడముఖం పెడముఖంగా ఉండటం వల్ల చాలా మందికి వీరి వివాహబంధం చిక్కుల్లో పడిందనే అభిప్రాయం కలిగించిందనీ విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మనీష్ మల్హోత్రా ఫ్యాషన్ షోలో వీరు కనిపించినప్పటికీ ఆ తర్వాత వారిద్దరి మధ్యా అపశ్రుతులు చేటుచోసుకున్నాయని అంటున్నారు.
సుజానే ఎంతో ఆలోచించిన తర్వాతే భర్తకు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకుందనీ, తమ కూతురు ఆవేదనను అర్ధం చేసుకున్న సంజయ్, జరీనా ఖాన్ దంపతులు సైతం ఆమె సంతోషంగా ఉండటమే తమకు ప్రధానమనే నిర్ణయానికి వచ్చారనీ ఆ వర్గాలు చెబుతున్నాయి. అయితే హృతిక్ కుటుంబ సభ్యులతో సుసానే సత్సంబంధాలు కొనసాగిస్తోందనీ, హృతిక్ తిరిగి ముంబై చేరుకోగానే పరిస్థితులు చక్కబడతాయనే అభిప్రాయంతో పింకీ, రాకేష్ రోషన్ దంపతులు ఉన్నారనీ ఆ వర్గాలు వెల్లడించాయి.
Pages: -1- 2 -3- News Posted: 7 April, 2009
|