విడిపోతున్న హృతిక్-సుజానే?
మరోవైపు డుగ్గూ (హృతిక్) తో సుజానే తెగతెంపులు చేసుకుందనే వదంతుల్లో ఎంత మాత్రం నిజ లేదని ఆమె సన్నిహితురాలు ఒకరు వివరణ ఇచ్చారు. 'డుగ్గు..సుజానే చాలా హ్యాపీగా ఉన్నారు. ఒకరంటే మరొకరికి ఎంతో ప్రేమ. వాళ్లింట్లో సీలింగ్ కు చెదపురుగులు పట్టడంతో ఆధునీకరణ పనులు చేపడుతున్నారు. దీంతో సుజానే తన పిల్లలతో వారం రోజులుగా తన తల్లిండ్రుల ఇంట్లో ఉంటోంది. మరమ్మతు పనులు మరో రెండు రోజుల్లో పూర్తికాగానే సుజానే తిరిగి వచ్చేస్తుంది' అని ఆమె వివరించారు.
సుజానేతోనే ఉన్నా...
దక్షిణాఫ్రికాలో 'కైట్స్' షూటింగ్ లో పాల్గొంటున్న హృతిక్ రోషన్ సోమవారం రాత్రి తిరిగి ముంబై చేరుకున్నారు. నేరుగా తన భార్యను కలుసుకునేందుకు జూహూలోని అత్తమామల ఇంటికి వెళ్లారు. 'సుజానా ఫ్యామిలీ సభ్యులందరితో కలిసి ఇప్పుడే డిన్నర్ చేశాను. ఇప్పుడు ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నాం' అంటూ హృతిక్ తెలియజేశారు. ఇంట్లో సీలింగ్ మరమ్మతు, , ఫ్లోర్ పనులు జరుగుతున్నందున పిల్లలతో సహా ఇద్దరం కలిసి ఇక్కడకు వచ్చామనీ, ఓ వారం రోజుల టెంపరరీ అడ్జెస్ట్ మెంట్ ఇదనీ ఆయన నవ్వుతూ వివరణ ఇచ్చారు.
Pages: -1- -2- 3 News Posted: 7 April, 2009
|