తల్లీ కొడుకుల పోటీ
అమేథి : వారి పేర్లు ప్రత్యర్థులుగా బ్యాలట్ కాగితంపై ఎన్నడూ కనిపించకపోవచ్చు. కాని ఈ ఎన్నికలలో సోనియా గాంధి, రాహుల్ గాంధి అలా ప్రత్యర్థులు అయ్యారు. అమేథిలో రాహుల్ మద్దతుదారుల పుణ్యమే ఇది. అమేథికి 20 కిలో మీటర్ల దూరంలోని రాయబరేలిలో అభ్యర్థిగా ఉన్న సోనియా కన్నా తమ యువనేత రాహుల్ కు మెజారిటీ అధికంగా రావాలని వారు ఆకాంక్షిస్తున్నారు. రాయబరేలిలో మూడవ పర్యాయం గెలవాలని సోనియా గాంధి ఆకాంక్షిస్తుండగా రాహుల్ రెండవసారి అమేథిలో విజయం దక్కించుకోవాలని అభిలషిస్తున్నారు. పలు ఇతర నియోజకవర్గాలలో నువ్వా నేనా అనే రీతిలో పోరు జరగనున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఈ రెండు చోట్ల పోటీలు ఎంత ఏకపక్షంగా సాగవచ్చునంటే ఉత్కంఠ కొరవడిందని కాంగ్రెస్ మద్దతుదారులు బాధపడేంతగా.
అందువల్ల వారు సొంతంగా పోటీ సృష్టించుకుంటున్నారు. ఏప్రిల్ 23, 30 తేదీలు వస్తే అమేథి, రాయ బరేలి మధ్య పోటీ ఉంటుంది. మే 16న ఫలితాల ప్రకటన అనంతరం తల్లీ కొడుకులలో ఎవరికి అధికంగా మెజారిటీ వచ్చిందో తేలిన తరువాత వారిలో కాంగ్రెస్ మద్దతుదారులలో ఉత్కంఠ తగ్గుతుంది. ఈ పోటీ కొంత తీవ్రంగానే ఉండవచ్చు. రాహుల్ 2004 ఎన్నికలలో 2.90 లక్షల వోట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. లాభసాటి పదవుల వివాదంపై తన స్థానానికి రాజీనామా చేసిన అనంతరం 2006లో ఉప ఎన్నికలలో సోనియా సుమారు 4.18 లక్షల వోట్ల ఆధిక్యంతో గెలుపొందారు. అమేథిలో జగదీష్ పూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్మల్ ఖాన్ మాట్లాడుతూ, రాహుల్ కు 5 లక్షల వోట్ల మెజారిటీ రావాలని స్థానిక శాఖ తొలుత లక్ష్యంగా పెట్టుకున్నదని, కాని దానిని నాలుగు లక్షలకు తగ్గించుకుందని తెలియజేశారు. ఇందుకు కారణాలు వివరించడానికి ఖాన్ నిరాకరించారు. కాని రాహుల్ ఏకైక ప్రత్యర్థి బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్ పి)కి చెందిన ఆశిష్ శుక్లా 'కలిగించే నష్టం' గురించి తమకు కచ్చితమైన అంచనాలు లేవని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. ఆశిష్ శుక్లా మాజీ కాంగ్రెస్ సభ్యుడు.
Pages: 1 -2- -3- News Posted: 12 April, 2009
|