తల్లీ కొడుకుల పోటీ
'మాయావతి ఇతర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ రాహుల్ పై కక్షతో వ్యవహరిస్తున్నట్లున్నారు' అని కాంగ్రెస్ నాయకుడు ఒకరు పేర్కొన్నారు. 'గత ఉప ఎన్నికలో సోనియాజీ నియోజకవర్గంలో వోటింగ్ జరిగిన తీరును దృష్టిలో పెట్టుకుంటే ఎంత మంది పోలింగ్ కేంద్రాలకు వస్తారో మాకు నమ్మకం లేదు. ఆ ఎన్నికలో పోలింగ్ చాలా తక్కువగా జరిగింది. నియోజకవర్గంలో పోలైన మొత్తం వోట్లలో 80 శాతం ఆమెకు రావడం అదృష్టమే' అని ఆ నాయకుడు అన్నారు. రాహుల్ ఎన్నికల ప్రచార బాధ్యతలను కొంత వరకు నిర్వహిస్తున్న మరొక స్థానిక కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతూ, విజయం ఖాయమని తేలడంతో ఉదాశీనత కొంత మేరకు చోటు చేసుకున్న మాట నిజమేనని అన్నారు.
రాహుల్ ఐదేళ్ళ పదవీ కాలంలో 'ఉన్నవారు', 'లేనివారు' మధ్య అమేథి కాంగ్రెస్ లో చీలికలు తలెత్తాయని కొందరు అంగీకరిస్తున్నారు. 'అది రాహుల్ తప్పు కాదు. ఆయన వందిమాగధులను ఇష్టపడరు. తాను పాల్గొనే ప్రతి సభలోను తమ ముఖాలు చూపెట్టి, ఆతరువాత వెనుకకు పోయి కూర్చుని విశ్రాంతి తీసుకోవడానికి అలవాటుపడిన వారిని ఆయన సహించరు' అని స్థానిక కాంగ్రెస్ కార్యకర్త మరొకరు చెప్పారు. 'అయితే, కాంగ్రెస్ దేనికైతే ఘనత వహించిందో ఆయన మేనేజర్లు అదే పని చేస్తున్నారు. వారు తమకు అభిమానపాత్రులను దగ్గరకు చేర్చుకుని మా వంటి వారిని దూరంగా నెట్టుతుంటారు' అని ఆయన చెప్పారు.
'చారిత్రక' ప్రాధాన్యం ఉన్నందున రాయ బరేలిలో రాజకీయ ప్రయోజక పథకాలను సమానంగా పంపిణీ చేసే వ్యవస్థ ఉండడం మరొక కారణం. ఆ కుటుంబం 1950 దశకం నుంచి దశాబ్దాల తరబడి ఆ నియోజకవర్గంపై ఆధిపత్యం వహిస్తున్నది. ముందు సోనియా మావగారు ఫిరోజ్ గాంధి, ఆతరువాత ఆమె అత్తగారు ఇందిరా గాంధి పార్లమెంట్ లో రాయబరేలికి ప్రాతినిధ్యం వహించారు. ఈ విషయంగా చూస్తే అమేథిని 'కొత్త స్థానం'గా పేర్కొంటున్నారు. 'ఇది ఒక విధంగా కొత్త స్థానం (గాంధి కోట).ఇక్కడ మొదట (కుటుంబంలో) 1974లో సంజయ్ గాంధి, ఆతరువాత రాజీవ్ గాంధి, సోనియాజీ, రాహుల్ గెలుపొందారు' అని అమేథిలోని నిహాల్ గఢ్ న్యాయ పంచాయతీ అధ్యక్షుడు అనీష్ వైష్ చెప్పారు.
Pages: -1- 2 -3- News Posted: 12 April, 2009
|