తల్లీ కొడుకుల పోటీ
గ్రామీణ విద్యుదీకరణ, చేతి పంపులు, మున్షీగంజ్ లోని సంజయ్ గాంధి ఆసుపత్రి స్థాయి పెంపు, జగదీష్ పూర్ లో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) అనుబంధ సంస్థ పునరుద్ధరణ వంటి తన వాగ్దానాలను చాలా వరకు నెరవేర్చినందుకు రాహుల్ గాంధికి 'నూటికి 90' మార్కులు వస్తున్నప్పటికీ మరొక అభిప్రాయం కూడా ఉంది. దళితుల ఇళ్ళకు వెళ్ళి వారితో సహ పంక్తి భోజనం చేయడం వంటి దళిత రాజకీయాలతో మాయావతిపై తనదే పైచేయి కావడానికి ప్రయత్నించే బదులు ఆమె పట్ల 'మరింత ఘర్షణ పంథా'ను రాహుల్ అనుసరించాలని కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు భావిస్తున్నారు. ఉదాహరణకు, రాయ బరేలిలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని అడ్డుకోవడానికి మాయావతి ప్రయత్నించినప్పుడు సోనియా వెనుకకు తగ్గారు. రాజీవ్ గాంధి పేరు పెట్టిన పెట్రోలియం పరిశోధనా సంస్థ, కాగితం మిల్లు, సిఆర్ పిఎఫ్ శిబిరం వంటి ప్రాజెక్టులు కొన్నిటిని అమేథిలో చేపట్టాలని రాహుల్ సంకల్పించినప్పుడు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి వాటిని కూడా అడ్డుకున్నారు. కాని ఆయన వీటిపై ఎదురుదాడికి దిగలేదు.
'వాస్తవం ఏమంటే ఢిల్లీలో, లక్నోలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న కారణంగా రాజీవ్ గాంధి, ఇందిరా గాంధి మా కోసం ఎంతో చేయగలిగారు' అని జగదీష్ పూర్ కు చెందిన కాంగ్రెస్ వృద్ధ నాయకుడు బాపూలాల్ పస్సి చెప్పారు. అమేథి 'యువ రాహుల్'కు ఒక ప్రయోగశాలగా ఉందనే అభిప్రాయం స్థానికంగా వ్యక్తమవుతున్నది. ఆయన తన తల్లిదండ్రుల నీడలో నుంచి ఇంకా బయటకు రావలసి ఉందని కాంగ్రెస్ నాయకుడు ఒకరు అన్నారు. 'ఆయన మా కళ్ళతో ఇండియాను శోధిస్తున్నారు. గ్రామంలో సామూహిక చేతి పంపుల వంటివి ఏమీ లేవని, అగ్ర వర్ణాలు తమ వాడల సమీపంలో ఏర్పాటు చేసిన పంపులను దళితులను ఉపయోగించుకోనివ్వరని ఆయన తెలుసుకున్నారు. అందువల్ల తన ఎంపి నిధిలో నుంచి కేటాయిస్తున్న నిధులతో చేతిపంపులను తటస్థ ప్రాంతాలలో ఏర్పాటు చేయాలని రాహుల్ నిర్ణయించుకున్నారు. అవి సక్రమంగా ఉపయోగపడేట్లు చూసేందుకు ఆయన కార్యకర్తలను నియమించారు' అని కాంగ్రెస్ కార్యకర్త ఒకరు చెప్పారు.
Pages: -1- -2- 3 News Posted: 12 April, 2009
|