'మహా' విజయావకాశాలు!
ఒక్కొక్క నియోజకవర్గంలో మండలానికి 250 శాంపిల్స్ చొప్పున సర్వే జరిగిందని, ఈ సర్వేను ముంబాయి, బెంగుళూరు, హైదరాబాద్ లకు చెందిన మూడు ప్రత్యేక సంస్థలు జరిపించాయని తెలిసింది. తొలివిడత ెన్నికలు జరుగుతున్న 22 లోక్ సభ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నాలుగు లేక ఐదు స్తానాలు కైవసం చేసుకునే అవకాశం వున్నట్టు ఈ సర్వేలు వెల్లడించాయి. 9 స్థానాల్లో పోటీ చేస్తున్న టిఆరెస్ కు 5 స్థానాల్లో స్పష్టమైన మెజారిటీ కనిపిస్తోందని, మరో నాలుగు నియోజకవర్గాల్లో మొదటి స్థానంలో వున్న కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇస్తుందని తెలిసింది. వామపక్షాలు చెరో స్థానం దక్కించుకుంటాయి. శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గంలో తిరిగి కింజరాపు ఎర్రన్నాయుడు విజయం సాధిస్తారని, గతంలో కంటె మెజారిటీ పెరుగుతుందని, ఈ నియోజకవర్గంలో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయని, అదేజరిగితే ఎర్రన్నాయుడికి 50వేలకు పైగా మెజారిటీ వస్తుందన్న ధీమా వ్యక్తమవుతోంది.
విజయనగరం లోక్ సభ స్థానం ఈసారి 'చేయి' జారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ తెలుగుద్శం అభ్యర్ధిగా పోటీచేస్తున్న డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడుకు స్థానికంగా బలం ఉండడంతో పాటు గత ెన్నికల్లో పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోవడంతో ఆయనకు ఈ సారి విజయావకాశాలు పెరిగాయని సర్వేలు వెల్లడించాయి. విశాఖ లోక్ సభ స్థానానికి కేంద్ర మంత్రి పురందరేశ్వరి పోటీ చేస్తుండడంతో ఇక్కడి రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. తెలుగుదేశం అభ్యర్ధిగా మరోసారి పోటీ చేస్తున్న ఎంవివిఎస్ మూర్తికి, పురందరేశ్వరికి గట్టి పోటీ ఉన్నప్పటికీ ెవరు గెలుస్తారన్న విషయంలో స్పష్టమైన సంకేతాలు రావడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే పురందేశ్వరి స్థానికురాలు కాదని, ఆమెను ఎన్నుకుంటే ప్రజలకు ప్రయోజనమేమీ ఉండదనిమూర్తి ప్రచారం జరుపుతున్నారు.
Pages: -1- 2 -3- -4- News Posted: 13 April, 2009
|