'మహా' విజయావకాశాలు!
ఇక తెలంగాణ విషయానికి వస్తే, మొదటివిడత ఎన్నికలు జరుగనున్న 17 నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు జరుగుతున్నా ఎక్కువ స్థానాల్లో టిఆరెస్, తెలుగుదేశం గెలుస్తాయన్న ధీమా వ్యక్తమయింది. ఈప్రాంతంలో కూటమి నాయకులు సుడిగాలి పర్యటనలు జరిపి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. టిఆరెస్ అధ్యక్షుడు కెసిఆర్ పోటీ చేస్తున్న మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి విఠల్ రావు రెండో స్థానంతో సరిపెట్టుకోవలసిందేనంటున్నారు. కెసిఆర్ కుమార్తె పాలమూరులోనే మకాంపెట్టి తండ్రి విజయానికి ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలోని షాద్ నగర్, మహబూబ్ నగర్, మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్ధులే పోటీలో ఉండడం కెసిఆర్ కు లాభిస్తోందని చెబుతున్నారు.
నల్గొండలో సిపిఐ నాయకుడు సురవరం సుధాకరరెడ్డి గట్టిపోటీ ఎదుర్కొంటున్నప్పటికీ విజయపథంలోనే ఉన్నారట. అక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి గుత్తా సుఖేందర్ రెడ్డి సొంత పార్టీలోనే అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డికి రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో తెలుగుదేశం అభ్యర్ధి జితేందర్ రెడ్డి గట్టి పోటీ ఇస్తున్నారు. అక్కడ చతుర్ముఖ పోటీ జరుగుతోంది. అదే జిల్లా మల్కాజి గిరిలో పోటీ రసవత్తరంగా వుంది. పోటీలో వున్న భీమ్ సేన్(తెలుగుదేశం), సర్వే సత్యనారాయణ(కాంగ్రెస్), దేవేందర్ గౌడ్(ప్రజారాజ్యం) గట్టివారే! విజయావకాశాలు ఎవరికి ఉన్నాయో చెప్పడం సాధ్యం కాదని తెలుస్తోంది. క్రాస్ ఓటింగ్ జరగకపోతే తెలుగుదేసం అభ్యర్ది గెలిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మెదక్ లోక్ సభ స్థానానికి పోటీలో వున్న టిఆరెస్ అభ్యర్ధి విజయశాంతికి విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయని, కారణం కాంగ్రెస్ అభ్యర్ధి నరేంద్రనాథ్ రాజకీయాలు కొత్తవారు కావడమేనని సర్వేల కథనం. నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపి మధు యాష్కీ, టిఆరెసి అభ్యర్ధి గణేష్ గుప్తా మధ్య పోటీ తీవ్రంగా ఉంది.
Pages: -1- -2- 3 -4- News Posted: 13 April, 2009
|