'మహా' విజయావకాశాలు!
ఖమ్మం లోక్ సభ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్ధి నామా నాగేశ్వరరావు ఉధృతంగా ప్రచారం చేస్తూ కేంద్ర మంత్రి రేణుకా చౌదరికి గట్టి పోటీ ఇస్తున్నారు. ఖమ్మం అసెంబ్లీ స్థానాన్ని ఆశించి భంగపడిన జలగం వెంకటరావు రెబెల్ అభ్యర్ధిగా పోటీలో ఉన్నారు. దీంతో రేణుక విజయావకాశాలు సన్నగిల్లాయని, జిల్లాకు చెందిన మంత్రి సంభాని చంద్రశేఖర్ కూడా రేణుకకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తెలుస్తోంది. వరంగల్, మహబూబాబాద్ లలో మహాకూటమి జైత్రయాత్ర జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీదతొలివిడత ఎన్నికలు జరుగుతున్న 22 లోక్ సభ నియోజకవర్గాల్లో అధిక స్థానాలను మహాకూటమి భాగస్వామ్య పార్టీలే కైవసం చేసుకోనుండగా, కాంగ్రెస్ రండు మూడు స్థానాలకే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. తమ పథకాల ప్రచారం ఇంకా విస్తృతంగా జరిగితే మరిన్ని స్థానాల్లో గెలుపు తమదేనని కూటమి నాయకులు ధీమాగా చెబుతున్నారు.
Pages: -1- -2- -3- 4 News Posted: 13 April, 2009
|