జెపికి వోటర్ల 'జయ' హో
'ప్రజలకు, రాజకీయ పార్టీలకు మధ్య పోటీ...' అని ఆయన తన వాహనంలో తన పక్కగా నిలబడిన 'ఎక్స్ ప్రెస్' విలేఖరితో అన్నారు. వాహనం వెంట జాగింగ్ చేస్తూ 'జెపి గారు, మేము గెలుస్తాము, మీకు వోటు వేసి' అని అన్న ఒక మధ్యవయస్కునితో కరచాలనం చేసేందుకు ఆయన తన మాటలన ఆపారు. కూకట్ పల్లి అసెంబ్లీ సెగ్మెంట్ ను కుదిపివేస్తున్న ప్రధాన సమస్యలు ఏమిటనే ప్రశ్నకు జెపి సమాధానం ఇస్తూ, 'ప్రస్తుతం కూకట్ పల్లిలో అతి పెద్ద సమస్య 'గూండారాజ్యం'. కబ్జాదారులు ఈ ప్రాంతంలో తమ ఆధిపత్యం సాగిస్తున్నారు. మనం ముందు ఈ సమస్యను పరిష్కరించవలసి ఉంది. ఇది కేవలం ఎన్నికలు కావు. ఇది జాతి పరివర్తనానికి ఒక లక్ష్యం' అని పేర్కొన్నారు.
శిక్షణ ద్వారా వైద్యుడై తరువాత ఐఎఎస్ టాపర్ అయిన జెపికి ఆంధ్ర ప్రదేశ్ లో గల పేరు ప్రఖ్యాతులు తక్కువేమీ కావు. ఆయన వివిధ హోదాలలో 16 సంవత్సరాల పాటు విశిష్ట సేవలు అందించారు. భారతదేశ పురోగతికి లోపభూయిష్ట పాలన పెద్ద అవరోధంగా ఉందని విశ్వసించిన జెపి 1996లో ఐఎఎస్ నుంచి రాజీనామా చేసి, భావసారూప్యత గల సహచరులతో కలసి లోక్ సత్తాను స్థాపించారు. రాష్ట్రంలో కొత్త రాజకీయ సంస్కృతి తీసుకురావడానికి ఒక ఉద్యమంగా ఆయన 2006లో లోక్ సత్తా పార్టీ (ఎల్ఎస్ పి)ని ఏర్పాటు చేశారు.
ఎన్నికల బరిలో ఉన్న పార్టీలు వోటర్లను ప్రలోభపెట్టడానికి ధన బలాన్ని, మద్యాన్ని ఉపయోగిస్తూ, ఎన్నికల వాగ్దానాలు చేస్తుంటే ఆందోళన చెందుతున్నారా అని ఆయనను విలేఖరి ప్రశ్నించారు. 'కపట రాజకీయ నాయకులు తమను ఇంతకాలం స్వప్రయోజనాలకు ఉపయోగించుకున్నారన జనం గ్రహించారు. ప్రజాస్వామ్యంలో సిసలైన స్టార్లు ప్రజలే. మద్యం లేదా ప్రలోభం ద్వారా తమకు ఇవ్వజూపుతున్న రూ. 500 తమను దోపిడీ చేసిన మొత్తంలో అణుమాత్రమేనని వారు ఇప్పుడు గ్రహించారు. మురికివాడలలో పేదలు పడుతున్న కష్టాలు చూస్తే నమ్మలేం. మౌన విప్లవం సంభవిస్తున్నది. ఎన్నికల ఫలితాల్లో ఇది విదితమవుతుంది' అని జెపి సమాధానం ఇచ్చారు.
ఎల్ఎస్ పి అద్యక్షుడు అయిన కారణంగా జెపి ఇతర పార్టీల అధినేతలతో పోలిస్తే తీరికలేకుండా ప్రచారం సాగిస్తున్నారు. సినిమా స్టార్లు వంటి జనాకర్షక ప్రచారకులపై ఆయన ఆధారపడకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. 'నా పిల్లలు పెరిగి పెద్దవారవుతుండడాన్ని నేను చూడలేకపోయాను. నేను నా కుటుంబంతో తగినంత సమయం గడపలేకపోయాను. అయితే, ఈ లక్ష్యంతో పోలిస్తే నా శ్రమ, త్యాగాలు ఏమాత్రం లెక్కలోకి రావు. ఇప్పుడు చరిత్ర సృష్టి జరుగుతున్నది. వాస్తవానికి ఇది రెండవ స్వాతంత్ర్య పోరాటం' అని జెపి తన వాహనం నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలలోకి ప్రవేశిస్తుండగా అన్నారు.
Pages: -1- 2 -3- News Posted: 14 April, 2009
|