జెపికి వోటర్ల 'జయ' హో
కూకట్ పల్లి అసెంబ్లీ సెగ్మెంట్ లోని అక్షరాస్యులైన వోటర్లలో అధిక సంఖ్యాకులు జెపి పట్ల సుముఖంగా ఉన్నట్లు కనిపిస్తున్నది. ఒక వ్యాపార సంస్థను నడుపుకుంటున్న 35 సంవత్సరాల కె. రాజేష్ కుమార్ తాను ఎల్ఎస్ పికే వోటు వేయబోతున్నట్లు బాహాటంగా ప్రకటించారు. మరి జనం, ముఖ్యంగా మురికివాడల వాసుల సంగతేమిటి? మోతినగర్ లో కొబ్బరి కాయల వ్యాపారి 32 సంవత్సరాల రవి ఎవరికి వోటు వేయాలో తాను ఇంకా నిశ్చయించుకోలేదని చెప్పారు. 'ఇంత వరకు నేను పిజెఆర్ కు వోటు వేస్తుండేవాడిని' అని రవి చెప్పారు. 'నేను ఆయన కుమారునికి వోటు వేసి ఉండేవాడినే. కాని ఆయన జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రచారం కోసం ఇప్పుడు ఇక్కడికి వచ్చిన నాయకుడు (జెపి) కొన్ని మంచి విషయాలే మాట్లాడారు. చూద్దాం. ఎవరికి వోటు వేయాలో పోలింగ్ రోజే నిర్ణయించుకుంటాను' అని రవి చెప్పారు.
ఇంతకుముందు ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో భాగంగా ఉన్న కూకట్ పల్లి అసెంబ్లీ సెగ్మెంట్ లో కెపిహెచ్ బి, మోతీనగర్, మూసాపేట, బాలానగర్, ఫతేనగర్, బేగంపేట, పాత బోయినపల్లి (హష్మత్ పేటతో సహా) వంటి డివిజన్లు ఉన్నాయి. కూకట్ పల్లి గ్రేటర్ హైదరాబాద్ లో పెద్ద నివాస, వాణిజ్య ప్రాంతంగా పేరొందింది. ఈ నియోజకవర్గంలోని ఇతర అభ్యర్థులలో ఎం. సుదర్శన రావు (టిఆర్ఎస్ - మహా కూటమి), వి.నరసింగరావు (కాంగ్రెస్), ఎం. కాంతారావు (బిజెపి), కూన వెంకటేష్ గౌడ్ (పిఆర్పీ), కొమ్ము రాజేష్ (బిఎస్పీ) కూడా ఉన్నారు.
Pages: -1- -2- 3 News Posted: 14 April, 2009
|