మనోజ్ కుమార్ కు పాల్కే
బాలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ కు 2007 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ పాల్కే అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇండియన్ సినిమా పితామహుడు దాదాసాహెబ్ పాల్కే పేరిట 1969లో ఈ అవార్డును కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భాతీయ సినిమాకు విశిష్ట సేవలందించిన వారికి ఏటా ఈ అవార్డును ప్రదానం చేస్తుంటారు.
బ్రిటిష్ ఇండియా పాలనలోని వాయవ్య సరిహద్దు ప్రాంతంలో ఉన్న అబోటాబాద్ లో మనోజ్ కుమార్ జన్మించారు. అబోటాబాద్ ప్రస్తుతం పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉంది. మనోజ్ కుమార్ అసలు పేరు హరికిషన్ గిరి గోస్వామి. గోసయిన్ హిందూ ఫ్యామిలీకి చెందిన ఆయన పదేళ్ల ప్రాయంలోనే దేశవిభజన సమయంలో తన కుటుంబంతో సహా ఇండియా వచ్చేశారు. రాజస్థాన్ లోని హనుమాన్ గఢ్ జిల్లాలో సెటిల్ అయ్యారు. ఢిల్లీ హిందూ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనంతరం ఆయన సినీరంగంలోకి అడుగుపెట్టారు. అప్పటి సూపర్ స్టార్ దిలీప్ కుమార్ అంటే ఆయన తగని మక్కువ. ఆ మక్కువ తోనే ఆయన మనోజ్ కుమార్ గా పేరు మార్చుకున్నారు. 'ఫ్యాషన్' (1957) చిత్రంలో తొలుత నటించారు. ఆ తర్వాత 'కాంచ్ కి గుడియా' (1960) చిత్రంలో సయీద ఖాన్ సరసన లీడ్ రోల్ పోషించారు. 'పియా మిలన్ కి ఆస్', 'రేష్మి రూమల్' వంటి వరుస చిత్రాల్లో ఆయన నటించారు.
Pages: 1 -2- News Posted: 18 April, 2009
|