మనోజ్ కుమార్ కు పాల్కే
దేశభక్తి హీరో
భగత్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన 'షహీద్' (1965) చిత్రం మనోజ్ లోని దేశభక్తుడిని వెలికి తీసింది. 1965లో ఇండో-పాకిస్తాన్ యుద్ధం తర్వాత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి స్యవంగా మనోజ్ ను కలిసి అప్పటి పాపులర్ స్లోగన్ 'జై జవాన్ జై కిసాన్' ఆధారంగా ఓ సినిమా తీయాల్సిందిగా కోరారు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే 'ఉపకార్' (1967). ఇందులో సిపాయిగా, రైతుగా ద్విపాత్రాభినయం చేయడంతో పాటు ఆ చిత్రం ద్వారా మనోజ్ దర్శకుడిగా కూడా మారారు. ఇందులోని 'మేరే దేశ్ కీ థర్తి' పాట అప్పట్లో ఎంతో పాపులర్ అయింది. గుల్షన్ బవ్రా సాహిత్యానికి కల్యాణ్ జీ-ఆనంద్ జీ అందించిన సంగీతం, మహేంద్ర కుమార్ నేపథ్య గానం ఆ పాటను ఎంతో ప్రాచుర్యంలోకి తీసుకువచ్చింది. ఆ చిత్రం మంచి హిట్ కావడంతో పాటు ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును కూడా మనోజ్ అందుకున్నారు. ఆ తర్వాత దేశభక్తి పూరిత భావాలతో తీసిన 'పూరబ్ ఔర్ పశ్చిమ్' చిత్రం మంచి పేరు తెచ్చింది. రోటీ కపడా ఔర్ మకాన్ (74), 'సన్యాసి', 'దస్ నంబ్రి' వంటి హిట్ చిత్రాలు ఆయన ఖాతాలోనివే. మనోజ్ కుమార్ చిత్రాల్లో గుర్తించుకోదగిన మరో దేశభక్తి కథా చిత్రం 'క్రాంతి'. అందులో తనకు ఎంతో ఇష్టుడైన దిల్ పీ కుమార్ ను డైరెక్ట్ చేసే అవకాశం మనోజ్ కు దక్కింది. ఇటీవల కాలంలో మనోజ్ కుమార్ ను పోలిన పాత్రను షారూక్ తన 'ఓం శాంతి ఓం' లో క్రియేట్ చేయడంతో ఆయనపై మనోజ్ కేసు వేశారు. అయితే కోర్టు బయటే ఆ కేసు పరిష్కారమైంది.
రిటైర్ మెంట్ అనంతరం ఆయన 2004లో శివసేన పార్టీలో చేరారు. మనోజ్ కుమార్ భార్య శశి గోస్వామి కాగా, ఆయన సోదరుడు రాజీవ్ గోస్వామి, కుమారుడు కునల్ గోస్వామి సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు.
Pages: -1- 2 News Posted: 18 April, 2009
|