హస్తం హవాకు హాల్ట్?
కమలాపురం: ఇక్కడ కాంగ్రెస్ తకఫున వీరశివా రెడ్డి, తెలుగుదేశం తరఫున పుత్తా నరసింహారెడ్డి, ప్రజారాజ్యం అభ్యర్ధిగా సుబ్బారెడ్డి పోటీలో వున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటు కాంగ్రెస్ లోని అసమ్మతి తమకు అనుకూలిస్తుందని తెలుగుదేశం, అభివృద్ధి పథకాలపై కాంగ్రెస్ ధీమాగా ఉన్నాయి. ఈ రెండు పార్టీల మధ్యే పోటీ ప్రధానంగా ఉండంతో వర్గ రాజకీయాలను రోజువారీ పరిణామాలు ప్రభావితం చేస్తున్నాయి.
బద్వేలు: ఈ రిజర్వుడు నియోజకవర్గంలో కమలమ్మ(కాంగ్రెస్), చెన్నయ్య(తెలుగుదేశం), వెంకటేశ్వర్లు(ప్రజారాజ్యం)పోటీలో ఉన్నారు. కడప లోక్ సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్ధి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా బద్వేలుపై దృష్టి సారించారు. ఫలితంగా కాంగ్రెస్ అభ్యర్ధికి వర్గపోరు ఉన్నప్పటికీ ఇది కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. అట్లూరు మండలంపై ఆధిపత్యం చూపించిన వారికే ఇక్కడ విజయావకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజారాజ్యం అభ్యర్ధి కూడా తనకు విజయావకాశాలు ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారు.
కోడూరు: కోడూరు రిజర్వుడు స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా శ్రీనివాసులు, తెలుగుదేశం తరఫున అజయ్ బాబు, ప్రజారాజ్యం తరఫున సరస్వతమ్మ పోటీలో ఉన్నారు. తెలుగుదేశం కంచుకోటగా ఈ నియోజకవర్గంలో ప్రజారాజ్యం రాకతో ఆ పార్టీకే అవకాసాలు మెరుగయ్యాయని చెప్పవచ్చు. అయితే ఆధిపత్య పోరు కాంగ్రెస్ కు అనుకూలంగా వుంది. తెలుగుదేశం మాత్రం మారిన తాజా ఎన్నికల పరిస్థితుల దృష్ట్యా పూర్వపు వైభవం పొందగలమని ధీమాగా ఉంది.
Pages: -1- 2 -3- -4- News Posted: 21 April, 2009
|