హస్తం హవాకు హాల్ట్?
రాజంపేట: ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా అమర్ నాథరెడ్డి, తెలుగుదేశం అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే మదన్ మోహన్ రెడ్డి, ప్రజారాజ్యం అభ్యర్ధిగా మాజీ ఎంపి రామయ్య బరిలో ఉన్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన బలమైన ఓటర్లు గల ఇక్కడ పోటీ ప్రధానంగా ప్రజారాజ్యం, తెలుగుదేశం పార్టీల మధ్యనే ఉంది. కాగ్రెస్ అభ్యర్ధి పార్టీ ప్రభుత్వ అభవృద్ధితో పాటు వైఎస్ ఇమేజిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే తెలుగుదేశం అభ్యర్ధికి సానుభూతి పవనాలు వీస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రజారాజ్యం అభ్యర్ధి తన కులానికి చెందిన ఓటర్ల మద్దతు ఉంటుందని ఆశిస్తున్నారు.
రాయచోటి: ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా స్థానికేతరుడు శ్రీకాంత్ రెడ్డి, తెలుగుదగేశం అభ్యర్ధిగా సీనియర్ సి్టింగ్ ఎమ్మెల్యే పాలకొండరాయుడు, ప్రజారాజ్యం అభ్యర్ధిగా మహబూబ్ బాషా తలపడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధిని ితర నియోజకవర్గం నుండి తీసుకు వచ్చి తమపై రుద్దారని పార్టీ శ్రేణులు, నాయకులు బాహాటంగా పార్టీ అధినేతతో కయ్యానికి దిగారు. తమ సహకారం ఉండబోదన్న ప్రకటనలు కూడా చేశారు. ఈ అసమ్మతి వర్గాన్ని బుజ్జగించినప్పటికీ అంతర్గతంగా అంతగా సహకారం అందడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ లోని లుకలుకలు తెలుగుదేశం అభ్యర్ధికి బాగా కలిసొస్తున్నాయి. ప్రజారాజ్యం అభ్యర్ధి మాత్రం ఏ ఒక్కరి సహకారం లేక ఒంటరిగా పోరాడుతున్నారు.
Pages: -1- -2- 3 -4- News Posted: 21 April, 2009
|