హస్తం హవాకు హాల్ట్?
మైదుకూరు: ఇక్కడి నుండి తెలుగుదేశం అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధిగా సిట్టింగ్ ఎమ్మెల్యే డి.ఎల్.రవీంద్రారెడ్డి, ప్రజారాజ్యం అభ్యర్ధిగా తిరుపాల్ రెడ్డి పోటీలో ఉన్నారు. తెలుగుదేశం అభ్యక్ధికి అనుకూల పవనాలు వీస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. 2004 ఎన్నికల నాటి పరిస్థితులు ఇప్పుడు ఎక్కడా కనిపించవు. ముస్లిం మైనారిటీలు రఘురామి రెడ్డి వెంట ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధికి అసమ్మతి వర్గీయుల బెడద ఉండగా, కాంగ్రెస్ పార్టీలోని తిరుపాల్ రెడ్డి పార్టీని విడిచి పెట్టి ప్రజారాజ్యం అభ్యర్ధిగా పోటీకి దిగడంతో కాంగ్రెస్ అభ్యర్ధికి గట్టి పోటీ ఎదురుకానుంది.
ప్రొద్దుటూరు: ఇక్కడి నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా సిట్టింగ్ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి, తెలుగుదేశం అభ్యర్ధిగా లింగారెడ్డి, ప్రజారాజ్యం అభ్యర్ధిగా మురళీధర్ రెడ్డి తలపడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధికి ప్రతికూల పరిస్థితులు ఉన్నట్టు ప్రచారం జరుగుతుండగా, తెలుగుదేశం అభ్యర్ధి ఆర్ధిక భారం వహిస్తూ కాంగ్రెస్ లోని వర్గ రాజకీయాలను అనుకూలంగా మలచుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రజారాజ్యం జిల్లా అధ్యక్షుడి కుమారుడు ఆ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తుండడంతో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు ప్రజారాజ్యం నుంచి గట్టి సవాలు ఎదురవుతోంది
జమ్మలమడుగు: ఇక్కడి నుండి కాంగ్రేస్ అభ్యర్ధిగాసిట్టింగ్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, తెలుగుదేశం అభ్యర్దిగా మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, ప్రజారాజ్యం అభ్యర్ధిగా నాగేంద్ర యాదవ్ పోటీ పడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి సానుభూతి పవనాలు వీస్తుండగా, పునర్విభజనలో రాజ్యసభ సభ్యుడు, తెలుగుదేశం అధికార ప్రతినిధి ఎంవి మైసూరా రెడ్డి ఆధిపత్యం సాగుతున్న యర్రగుంట్ల మండలంలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉంది. పర్యవసానంగా కాంగ్రెస్ పార్టీ అజెండాలో అభివృద్ధి మాత్రమే మిగలగా, ఇద్దరు ఉద్దండుల మధ్య ప్రజారాజ్యం గట్టి పోటీని ఎదుర్కొంటోంది.
Pages: -1- -2- -3- 4 News Posted: 21 April, 2009
|