కోస్తా ఎవరి కొమ్ము కాసేను?
అద్దంకి నుండి పోటీచేసిన బలరాంపై కాంగ్రెస్ అభ్యర్ధి మార్టూరు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ విజయం సాధించవచ్చంటున్నారు. బలరాం కారణంగానే తెలుగుదేశం సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు బాచిన చెంచు గరటయ్య, ముక్కు కాశిరెడ్డి కాంగ్రెస్ లో చేరగా, మరో సీనియర్ నాయకురాలు సాయి కల్పనారెడ్డి ప్రజరాజ్యంలో చేరి ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో పోటీచేశారు. పర్చూరుకు చెందిన మరో సీనియర్ నాయకుడు బ్రహ్మారెడ్డి ఇటీవల ప్రజారాజ్యంలో చేరి, మళ్లీ కాంగ్రెస్ లోకి వెళ్లడంతో కాంగ్రెస్ విజయావకాశాలు పెరిగాయి. డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో పాటు ముఖ్యమంత్రి సమీప బంధువు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తదితరుల విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయి.
ప్రకాశం జిల్లాకే చెందిన ఆర్ధిక మంత్రి కె.రోశయ్య ఈ సారి పోటీలో లేకపోయినా, తన వారసుడిగా చీరాల నియోజకవర్గంలో పోటీచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్ధి ఆమంచి కృష్ణమోహన్ గెలుపుకోసం విశేషంగా కృషి చేశారు. మిగతా జిల్లాల్లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, తెలుగుదేశం, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా ప్రజారాజ్యం రంగ ప్రవేశం, తెలుగుదేశం ప్రకటించిన ఆకర్షణీయమైన పథకాలు... వంటి అనేక అంశాలతో పోలింగు శాతం అనూహ్యంగా పెరిగినప్పటికీ, ఓటర్లు గుంభనంగా ఉండడంకో గెలుపోటముల సూచనలు స్పష్టంగా కనిపించడం లేదు. వైఎస్ మంత్రివర్గ సభ్యులు పిన్నమనేని వెంకటేశ్వరరావు, మండలి బుద్ధప్రసాద్, కాసు కృష్ణరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, కొణతాల రామకృష్ణ, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, శతృచర్ల విజయరామరాజు ప్రభృతులు గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు.
Pages: -1- 2 -3- News Posted: 26 April, 2009
|