క్రెడిట్ కార్డు ఇక్కట్లు
గడచిన మూడు రోజులుగా ఐసిఐసిఐ బ్యాంకు సవరించిన పరిమితి గురించి తన క్రెడిట్ కార్డు హోల్డర్లను అప్రమత్తం చేస్తూ ఎస్ఎంఎస్ పంపిస్తున్నది. ఆ పరిమితి కార్డును బట్టి ఉంటుంది. 20 - 57 రోజుల బిల్ వ్యవధికి వడ్డీ రహితంగాను, ఆ తరువాత అధిక వడ్డీ రేటుకు రుణ సౌకర్యాన్ని కల్పిస్తున్న క్రెడిట్ కార్డులు ఇకమీదట ఎంపిక చేసిన కొందరు కార్డు కస్టమర్లకు అందుబాటులో ఉండవని ఈ ఉదంతాల ద్వారా విదితమవుతున్నది.
ఈ మార్పులో హేతుబద్ధత గురించి తెలుసుకోవడానికి ఐసిఐసిఐ బ్యాంకును ఒక వార్తా పత్రిక విలేఖరి సంప్రతించినప్పుడు ఈ విషయమై వ్యాఖ్యానించేందుకు బ్యాంకు నిరాకరించింది. వార్షిక ఫలితాల ప్రకటనకు ముందు ఇది మౌనంగా ఉండవలసిన కాలమని బ్యాంకు పేర్కొన్నది. కాని సిటీబ్యాంక్ స్పందించింది. 'ఇది నిజం కాదు. అయితే, బాధ్యతాయుతంగా రుణ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలనే మా చైతన్య కార్యక్రమంలో భాగంగా మా కస్టమర్లనందరినీ తమ కనీస మొత్తం బకాయిని చెల్లించేట్లుగా ప్రోత్సహిస్తుంటాం. సాధ్యమైతే తమ కనీస బకాయి మొత్తం కన్నా ఎక్కువ తిరిగి చెల్లించవలసిందిగా సూచిస్తుంటాం. దీని వల్ల వారి వ్యయ పరిమితి పెరిగి వారి క్రెడిట్ రేటింగ్ మెరుగవుతుంది' అని సిటీబ్యాంక్ వివరించింది.
క్రెడిట్ బ్యాంకు హోల్డర్ గతంలో బాకీలు పూర్తిగా చెల్లించని పక్షంలో తాము ఇటువంటి చర్యలను తీసుకోవచ్చునని ఇతర బ్యాంకులు సూచించాయి. 'బకాయిలను మొదటిసారి పూర్తిగా చెల్లించనప్పుడు మేము కార్డులను బ్లాక్ చేయం. అయితే,.గడువు తేదీలోగా చెల్లింపులు జరగలేదని మేము గమనిస్తే ఆ చెల్లింపులు జరిగేంతవరకు కార్డుపై తదుపరి లావాదేవీలను మేము ఆమోదించం. పదేపదే బకాయిలు ఎగవేయడం కార్డులను బ్లాక్ చేయడానికి దారి తీయవచ్చు' అని హెచ్ఎస్ బిసి ఇండియా రియల్ అసెట్స్, కార్డ్స్ విభాగం అధిపతి రవి సుబ్రహ్మణ్యన్ వివరించారు. 'రుణ సౌకర్యం నిరంతరం అందుబాటులో ఉండాలంటే సకాలంలో చెల్లింపులు జరపడమే ఏకైక పద్ధతి' అని సుబ్రహ్మణ్యన్ సూచించారు. క్రెడిట్ కార్డు సంవత్సరాల తరబడి దగ్గర ఉన్నప్పటికీ దానిని అంతగా ఉపయోగించుకోకపోతే కార్డు బ్లాక్ కావచ్చునన్నమాట!
Pages: -1- 2 News Posted: 27 April, 2009
|