నష్టపోయినా మిట్టల్ టాప్
హోలీ బ్రాన్సన్, ఇవాంకా ట్రంప్, మీర్జా బావుర్, మరీనా బెర్లూస్కోని వంటి వారు కూడా ఈ పత్రిక జాబితాలో స్థానం సంపాదించారు. ఇతరులు అనేక మంది వలె వారు ఈ జాబితాలో పేర్కొనడాన్ని ఇష్టపడలేదని, 'సండే టైమ్స్' పత్రిక వారి ఆకాంక్షను మన్నించిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది.
నంబర్ వన్ స్థానంలో ఉన్న లక్ష్మీ మిట్టల్ తో పాటు రాగి వాణిజ్యవేత్త అనిల్ అగర్వాల్ (600 మిలియన్ పౌండ్లు, 28వ స్థానం), గేమింగ్ సాఫ్ట్ వేర్ ప్రవీణుడు అనురాగ్ దీక్షిత్ (559 మిలియన్ పౌండ్లు, 29వ స్థానం), జటానియా సోదరులు (500 మిలియన్ పౌండ్లు, 31వ స్థానం) కూడా ఈ జాబితాలో సంపన్న భారతీయులలో చోటు చేసుకున్నారు.
కాగా, మార్కెట్ సంక్షోభానికి అపారంగా నష్టపోయినవారిలో విమానయాన వాణిజ్యవేత్త, వర్జిన్ ఎయిర్ వేస్ అధిపతి సర్ రిచర్డ్ బ్రాన్సన్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. ప్రస్తుతం బ్రాన్సన్ సంపద విలువ 1.2 బిలియన్ పౌండ్లు. ఈ సంక్షోభంలో వాణిజ్యవేత్తల స్టాక్ లు, ఆస్తుల విలువ బాగా పడిపోయింది. అత్యంత సంపన్నుల జాబితాలోని మహిళలలో ప్రతిభా సచ్ దేవ్ 350 మిలియన్ పౌండ్ల సంపదతో ఎలిబజెత్ రాణి కన్నా ఐదు స్థానాలు ఎగువన ఉన్నారు. ఎలిజబెత్ రాణి సంపద విలువ 270 మిలియన్ పౌండ్లు.
Pages: -1- 2 News Posted: 27 April, 2009
|