సప్లయర్ల తిప్పలు
విశాఖపట్నం: ఎన్నికల్లో పోలింగు పూర్తయ్యే వరకు ఓటర్లతో సమానంగా వాళ్లూ దేవుళ్లే అభ్యర్ధులకి! ప్రచారం సమయంలో వారి అవసరం మరీ ముఖ్యం. తీరా ఇప్పుడు, పోలింగు పూర్తయ్యాక, వాళ్లు అంతదూరంలో కనిపిస్తే చాలు, ముఖం చాటేసుకుని పారిపోతున్నారు. దగ్గరకి రాకుండా ఆమడ దూరంలో అట్టే పెడుతున్నారు. ఇంతకీ వాళ్లెవరంటే... పోలింగు తేదీ వరకూ అభ్యర్ధులకు అవసరమయ్యే అన్ని సర్వీసులనూ సమకూర్చిన సప్లయర్లు. బాకీల వసూలు కోసం అభ్యర్ధుల కాళ్లా వేళ్లా పడాల్సిన దుస్థితి ఇప్పుడు వారిది.
'ఏమిటండీ ఇది? పోలింగు రోజు లోగా మొత్తం బాకీ తీర్చేస్తానని సార్ మాటిచ్చారు. ఇప్పటికి ఇచ్చింది ముప్ఫై శాతం. ఇంకా లక్షా డెబ్భై వేల రూపాయలు రావాలి' అని ఇక్కడి ప్రజారాజ్యం పార్టీ ఆఫీసు చుట్టూ గత పదిరోజులుగా ప్రదక్షిణలు చేస్తున్న ఓ సప్లయర్ పార్టీ కార్యకర్త దగ్గర మొరపెట్టుకున్నాడు. ఈ ప్రాంతంలో ఏప్రిల్ 16న ఎన్నికలు ముగిసినా , మైక్ సెట్లు, వాహనాలు, ఆహారం, తాగునీరు, టెంట్లు, వీటన్నింటి కంటె ముఖ్యంగా బహిరంగ సభలకు జనాలను సరఫరా చేసినవారి బిల్లులు మాత్రం ఇంకా పెండింగులోనే ఉన్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీల అభ్యర్ధులు ఈ సప్లయర్ల ముఖాలే చూడడం మానేశారు.
Pages: 1 -2- -3- News Posted: 28 April, 2009
|