సప్లయర్ల తిప్పలు
నగరానికి చెందిన మంచినీటి సప్లయర్ ఒకరు అనేకమంది అభ్యర్ధుల దగ్గర కొంత అడ్వాన్సు తీసుకుని మంచినీటి ప్యాకెట్లు, సీసాలు సరఫరా చేశారు. 'మామూలుగా వంద మంచినీటి ప్యాకెట్లు 40 రూపాయలకి అమ్ముతాం. కాని ఈ ఎన్నికల సమయంలో నగరంలో ఆరుగురు అభ్యర్ధులకు వంద ప్యాకెట్లు 35 రూపాయలకే సప్లై చేశాం. ఒక్కొక్కటి వంద ప్యాకెట్లు పట్టే బస్తాలు సగటున వంద చొప్పున ఒక్కొక్క అభ్యర్ధికి ప్రచారం సమయంలోఇచ్చాం. ఇంతవరకూ ఒక్కరు కూడా పూర్తిగా బకాయిలు చెల్లించ లేదు' అని రఘు రామారావు అనే సప్లయర్ వాపోయారు. ఒక్కొక్కరూ అడ్వాన్సుగా ఇరవై వేల రూపాయలు రెండేసి వాయిదాలలో ఇచ్చారనీ, ఇంకా 30 నుంచి 35 వేల రూపాయల వరకూ బాకీ ఉన్నారనీ, ఇప్పుడు వెళ్లి అడిగితే డిస్కౌంట్లు కావాలంటున్నారనీ ఆయన చెప్పారు.
సాధారణంగా సప్లయర్లు రాజకీయ నాయకులకు, ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఏ వస్తువూ అరువు ఇవ్వరు. కాని ఎక్కడినుంచో రావలసిన నిధులు మార్గమధ్యంలో చెకింగుల కారణంగా ఆగిపోయాయని, అప్పుల్లో ములిగిపోయామనీ, అనేక సమస్యలను వల్లె వేస్తుంటారని రామారావు చెప్పారు. నగరంలో వ్యాపారవేత్త అయిన కాంగ్రెస్ అభ్యర్ధి ఒకరు తన బాకీలు చెల్లించే పని స్నేహితులకు అప్పచెప్పి, సప్లయర్లను వారి దగ్గరకు వెళ్లమని పంపిస్తున్నారు.
Pages: -1- 2 -3- News Posted: 28 April, 2009
|