సప్లయర్ల తిప్పలు
ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్ధులకు ఆహార పదార్ధాలు సరఫరా చేసిన సప్లయర్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆ అభ్యర్ధులు సప్లయర్ చేసే ఫోన్ కాల్స్ ను అసలు రిసీవ్ చేసుకోవడం లేదట! 'డబ్బు కదలికల మీద పోలీసు నిఘా కారణంగా అభ్యర్ధులకు ఎదురయ్యే సమస్యలను అర్ధం చేసుకోగలం. అయితే ఎన్నికలు పూర్తయి పది రోజులు గడిచిపోయాయి. కాని ఆభ్యర్ధులు మాత్రం మా బిల్లులు చెల్లించే విషయాన్నే పట్టించుకోవడం లేదు' అని చెప్పారు నగరంలో తెలుగుదేశం అభ్యర్ధులకు వస్తువులు ఇచ్చిన సప్లయర్. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పరిస్థితి ఇంతకంటె భిన్నంగా ఏమీ లేదు. పరిచయస్తుల దగ్గర, వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు చేసిన ఓ అభ్యర్ధి జాడే లేదు! ఇదిగో వస్తాడు, అదిగో వస్తాడు ఆగండంటూ అతడి మద్దతుదారులు అప్పులవాళ్ల కాళ్లా వేళ్లా పడి బతిమాలుతున్నారు.
Pages: -1- -2- 3 News Posted: 28 April, 2009
|