కాంగ్రెస్ చెంత మళ్లీ టిఆరెస్
హైదరాబాద్ : రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు తిరిగి మారుతున్నసూచనలు సోమవారం గోచరించాయి. తృతీయ ఫ్రంట్ ను పటిష్ఠం చేసేందుకు ప్రాంతీయ పార్టీలను సమీకరించే అవకాశాలను తెలుగు దేశం పార్టీ (టిడిపి), సిపిఎం అన్వేషిస్తున్నాయి. కాగా కేంద్రంలో కాంగ్రెస్ లేదా భారతీయ జనతా పార్టీ (బిజెపి) సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడిన పక్షంలో రాష్ట్రంలో టిడిపితో కలసి సాగడానికి తాను ఇష్టపడకపోవచ్చునని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు సూచనప్రాయంగా తెలియజేశారు.
సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ సోమవారం న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో ఆయన నివాసంలో నాలుగు గంటల పాటు సమావేశం అయ్యారు. రాష్ట్రంలో మహా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందనే దృఢ విశ్వాసాన్ని చంద్రబాబు వ్యక్తం చేస్తుండడంతో ఆ ఇద్దరు నేతలు కేంద్రంలో కాంగ్రెసేతర, బిజెపియేతర ప్రభుత్వం ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించారు.
Pages: 1 -2- -3- News Posted: 28 April, 2009
|