కాంగ్రెస్ చెంత మళ్లీ టిఆరెస్
అయితే, మహా కూటమి భాగస్వామ్య పక్షమైన టిఆర్ఎస్ రాష్ట్రంలో మహా కూటమి కన్నా కాంగ్రెస్ - టిఆర్ఎస్ - ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) సంకీర్ణాన్ని ఇష్టపడుతున్నట్లు కనిపిస్తున్నది. మహా కూటమిలో టిడిపి, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతో పాటు టిఆర్ఎస్ కూడా భాగస్వామే. 'రాష్ట్రంలో టిడిపి సారథ్యంలో ఏర్పడే ప్రభుత్వం కేంద్రంలో కాంగ్రెస్ లేదా బిజెపి సారథ్యంలో నెలకొనే ప్రభుత్వానికి సానుకూలంగా ఉండదు. ఎందుకంటే ఈ రెండు జాతీయ పార్టీలు టిడిపిని వామపక్షాలకు సహజమైన మిత్ర పక్షంగా భావిస్తుంటాయి' అని టిఆర్ఎస్ నాయకుడు ఒకరు చెప్పారు.
కాని ఎన్నికల ఫలితాలు ఇంకా వెలువడక ముందే కెసిఆర్ హడావుడి పడిపోయి ప్లేటు మారుస్తున్నారని టిడిపి నాయకులు అంటున్నారు. 'టిఆర్ఎస్ 9 లోక్ సభ సీట్లకు పోటీ చేసింది. కేంద్రంలో బేరసారాలు సాగించే శక్తి పొందాలంటే అది కనీసం నాలుగైదు సీట్లను గెలుచుకోవలసి ఉంటుంది. తన అధీనంలో కొన్ని సీట్లయినా లేకుండా ఆయన కాంగ్రెస్ తో లేదా బిజెపితో కలసి సాగే అవకాశాల గురించి అన్వేషించడం తొందరపాటే అవుతుంది' అని టిడిపి నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు.
Pages: -1- 2 -3- News Posted: 28 April, 2009
|