కాంగ్రెస్ చెంత మళ్లీ టిఆరెస్
వాస్తవానికి కెసిఆర్ ఆదివారం న్యూఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధితోను, బిజెపి నాయకుడు ఎల్.కె. అద్వానీతోను సమావేశం కావలసి ఉంది. కాని ఆయన ఆదివారం ఢిల్లీకి వెళ్ళలేదు. 'తాము అధికారంలోకి వచ్చిన 100 రోజులలోగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని బిజెపి వాగ్దానం చేసింది. తెలంగాణ మంజూరుపై కాంగ్రెస్ మాకు హామీ ఇచ్చిన పక్షంలో కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలోని ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి, రాష్ట్రంలో కాంగ్రెస్, టిఆర్ఎస్, పిఆర్పీలతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మాకేమీ అభ్యంతరం ఉండదు' అని టిఆర్ఎస్ నాయకుడు ఒకరు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు టిడిపి కట్టుబడి ఉందని, పార్టీ ఎన్నికల ప్రణాళికలో అదే విషయాన్ని వాగ్దానం చేశామని చంద్రబాబు సోమవారం కెసిఆర్ కు టెలిఫోన్ లో హామీ ఇచ్చి ఆయన ఢిల్లీ యాత్రను వాయిదా వేయించినట్లు కనిపిస్తున్నది. అయితే, కేంద్రంలో కాంగ్రెస్ తో లేదా బిజెపితో కలసి సాగడానికి తాను ఇష్టపడతానని కెసిఆర్ సూచించడంతో టిడిపి, టిఆర్ఎస్ ఎవరి దారి వారు చూసుకోవడానికి ఎంత కాలం ఆగుతాయనేదే ప్రశ్న.
Pages: -1- -2- 3 News Posted: 28 April, 2009
|