పవన్ కల్యాణ్ ఎక్కడ?
హైదరాబాద్: పవన్ కల్యాణ్ ఏమయ్యారు? ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారిన చర్చ ఇది. ఎన్నికల ప్రచారం ముగిసినప్పటి నుంచి పవన్ కల్యాణ్ పార్టీ కార్యాలయం వైపు కూడా రాలేదు. ఫలితాలు వెలువడిన తర్వాత కూడా ఆయన జాడ లేదు. ప్రజారాజ్యం పార్టీ అనుబంధ విభాగమైన యువరాజ్యంకు సారధ్యం వహిస్తున్న ఆయన పార్టీపై అలకవహించే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. టిక్కెట్ల పంపిణీ, పార్టీ విధాన నిర్ణయాలలో అల్లు అరవింద్ పెత్తనంతో విసిగిపోయే పవన్ కల్యాణ్ తోపాటు ఆయన సోదరుడు నాగేంద్రబాబు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు అధ్య క్షుడు చిరంజీవి తన చుట్టూ ఉన్న నీడల చట్రం నుంచి బయటకు రాలేకపోతున్నారా? పార్టీకి పవన్ కల్యాణ్ సారధ్యం అవసరమని శ్రేణులు కోరుతున్నారా? పవన్‌కు పగ్గాలు అప్పగించకపోతే పార్టీ మనుగడ కష్టమని నేతలు భావిస్తున్నారా? కొద్దిరోజుల నుంచి ప్రజారాజ్యం పార్టీలో ఇలాంటి వాదనలే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పార్టీని భ్రమల్లో ముంచి, కమర్షియల్ ముద్ర వేసిన శక్తుల నుంచి పార్టీని రక్షించుకోవాలంటే పవన్ కల్యాణ్ వంటి ఆవేశం, ఆలోచన ఉన్న నాయకుడు పగ్గాలు చేపట్టవలసిన అవస రమన్న అభిప్రాయం మెజారిటీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.
పార్టీలో కొనసాగుతున్న ఒంటెత్తు పోకడలపై పవన్ మొ దటి నుంచి ఆగ్రహంతో ఉన్నా, అన్నయ్యపై ఉన్న ప్రేమ వల్ల దానిని ఎక్కడా వ్యక్తం చేయకుండా జరుగుతున్న పరి ణామాలను మౌనంగానే పరిశీలిస్తూ వచ్చారు. చివరకు టికెట్ల పంపిణీలో తనను పక్కకు పెట్టినా, అన్నింటినీ మౌనంగా భరించారు. తాను దేశంలో లేని సమయంలో కమిటీలు ఏర్పాటు చేసినా ఆయన తన నిరసన బాహా టంగా వ్యక్తం చేయలేదు. పార్టీ తప్పుదోవపట్టడానికి, అనుకున్న లక్ష్యం పక్కదారిపట్టడానికి కారణం చిరంజీవిని వెన్నంటి ఉండే నీడలాంటి శక్తేనని తెలిసినా, పవన్ తన అన్నయ్యపై ఉన్న అపారమైన అభిమానంతో వారిని ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తుండిపోయారు.
Pages: 1 -2- -3- News Posted: 22 May, 2009
|