పవన్ కల్యాణ్ ఎక్కడ?
సత్తు రూపాయల్లాంటి చెల్లని కాసులతో పార్టీ జయాపజయాలు, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికలపైనా చర్చలు.. నిర్ణయాలేంటని ప్రజారాజ్యం గెలుపు వీరులు భగ్గుమంటున్నారు. ప్రజా రాజ్యం అధ్యక్షుడు చిరంజీవి అధ్వర్యంలో రెండు రోజులుగా జరుగుతున్న ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాలు సెగలు చిమ్ముతున్నాయి. పార్టీ శాస నసభ్యులను పూర్తిగా పక్కన పెట్టి ఎన్నికల్లో ఘోరప రాజయం పాలైన వారిని, వయసు మళ్లిన వృద్ధ నేతలను పెట్టుకుని పార్టీ రాజకీయ సమీక్షలు చేస్తుండడాన్ని పలు వురు శానససభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు. పీఆర్పీ శాసనసభాపక్ష నేతగా చిరంజీవిని ఎన్నుకోవటం తోటే మమ అనిపించిన అధిష్టానం ఎమ్మెల్యేలను పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పూర్తిగా దూరంగా ఉంచింది. చిరంజీవి పిఏసీ సమావేశంలో పూర్తి మౌనం పాటించడం మినహా సీనియర్ల విమర్శలకు అడ్డుకట్ట వేయలేక పోతున్నారు.
ఇప్పటికే పార్టీ పరాజయానికి అల్లు అరవింద్ కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నా చిరంజీవి ఈ అంశంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మరో సీనియర్ నేత టి. దేవేందర్ గౌడ్‌పై వస్తున్న విమర్శలు తక్కువేమీ కాదు. ఈ ఇరువురు నాయకుల వ్యవహార శైలి పిఏసీలో రెండో రోజు పలువురు సభ్యులు చర్చకు తెచ్చినట్లు సమా చారం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉదయం నుంచి సాయంత్రం దాకా కార్యాలయంలోనే గడిపిన చిరంజీవి పిఏసీ సమావేశం నుంచి బయటకు రాలేదు.పీఆర్పీ రాజకీయ వ్యవహారాల కమిటీ శనివారం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. పార్టీ గ్రామ స్థాయి నుంచి రాష్టస్థ్రాయి దాకా నాలుగంచల పద్దతిన పునర్ని ర్మాణం చేయటం, సభ్యత్వాలను విస్త్రృతంగా చేపట్టి వనరులను సాధించడంపై దృష్టి సారించనున్నారు.
Pages: -1- -2- 3 News Posted: 22 May, 2009
|