పవన్ కల్యాణ్ ఎక్కడ?
అయితే, ఎన్నికల ఫలితాలు పార్టీని అప్రతిష్టపాలు చేయడంతో పాటు.. చిరంజీవి వ్యక్తిగత ప్రతిష్ట, ఇమేజిని దెబ్బతీయడంతో ఖిన్నుడైన పవన్ కల్యాణ్ నగరం నుంచి చాలారోజుల పాటు దూరంగా వెళ్లిపోయారు. అన్నయ్య సారథ్యంలో పార్టీ ఉన్నత స్థాయికి ఎదుగుతుందని భావిం చిన పవన్.. ఫలితాలు చూసి, అందుకు దారితీసిన కార ణాలపై మానసిక వేదనకు గురయ్యారంటున్నారు. చిరం జీవి అనవసరంగా ‘తననీడ’ మాటలు విని రాజకీయాల్లోకి వచ్చి ఉన్న పేరును పోగొట్టుకున్నారని, ఆయనతో పాటు పవన్ ఇమేజ్ కూడా దెబ్బతీశారన్న ఆవేదన వారిద్దరి అభిమానుల్లో లేకపోలేదు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని.. పార్టీ దుస్థితి, తిరోగమనానికి కారణమయిన శక్తులపై పీకల్లోతు ఆగ్రహం ఉన్నా, తాను పెదవి విప్పితే పార్టీ మరింత నష్టపోతుందన్న భావనతో పవన్ పార్టీ కార్యాలయానికి కూడా రాకుండా దూరంగా ఉంటున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పార్టీ ఓడిన తర్వాత ఆయన ఒక్కసారి కూడా కార్యాలయానికి రాకపోవడమే దానికి నిదర్శనం.
గతంలో ప్రతిరోజూ కార్యాలయానికి వచ్చి, మీడియాతో కూడా మాట్లాడిన పవన్ ఫలితాల అనంతరం కార్యాలయానికి రాకుండా ముఖం చాటేయడానికి కారణం కూడా అదేనంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ మళ్లీ ఐదేళ్లు మనుగడ సాగించా లంటే యువరక్తం, కొత్త ఆలోచనలున్న పవన్ కల్యాణ్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలన్న వాదన ప్రజారాజ్యం పార్టీలో వినిపిస్తోంది. పార్టీని రక్షించటం ఒక్క పవన్‌కు మాత్రమే సాధ్యమన్న నిశ్చితాభిప్రాయం శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. రాజకీయ ఎత్తుగడలు లేకుండా, సినిమా రంగంలో మాదిరిగా కేవలం ఒకరిపైనే ఆధారపడినందుకే ఈ దుస్థితి వచ్చిందని అభిప్రాయపడుతున్నారు. పవన్ వంటి ముక్కుసూటి మనిషి, నిస్వార్థనేత పార్టీ పగ్గాలు అందుకుంటే అలాంటి నీడలను తప్పించవచ్చం టున్నారు. ‘అన్నయ్య పక్కన ఆ నీడ ఉన్నంతవరకూ ఈ పార్టీ బాగుపడదు. అన్నయ్య కూడా ఆ నీడను ఒదులుకోలేడు. ఆ బలహీనత అందరికీ తెలుసు. ఆయన గురించి నాయకులు మాట్లా డుతుంటే సహించలేక ఏకంగా పార్టీ రాజకీయ కమిటీనే రద్దు చేశారంటే.. ఇక ఈ పార్టీకి కల్యాణే దిక్కు. ఆయన పట్టించుకోకపోతే రానున్న ఐదేళ్లలో లోక్‌సత్తా తర్వాత స్థానంలో ఉన్నా ఆశ్చర్యపోవలసిన పనిలేద’ని వరంగల్ జిల్లాకు చెందిన ప్రముఖుడొకరు వ్యాఖ్యానించారు.
Pages: -1- 2 -3- News Posted: 22 May, 2009
|