పసిడి ధరలు పైపైకి
ఈ సీజన్లో ఒక్క అక్షయ తృతీయ తప్ప తమకు సరైన బంగారం అమ్మకాలు చోటుచేసుకోలేదని, పెళ్ళిళ్ల సీజన్ ముగుయనున్నప్ప టికీ గోల్డ్ విక్రయాలు ఆశించిన స్థాయిలో నమోదు కాలేదని, జూన్ 25 వరకు కత్తెర నెల కొనసాగుతుందని చంద్ర న బ్రదర్స్ డైరెక్టర్ డాక్టర్ జానా రామారావు తెలిపారు. ఆషాడ మాసంలోనూ దాదాపు డిస్కౌంట్ మార్కెట్టే ఉంటుందని, మొత్తంగా చూసుకుంటే ఈ సంవత్సరం బంగారం మార్కెట్ అంత ఆశాజనకంగాలేదని ఆయన పెదవి విరిచారు. నవంబర్‌లో వచ్చే దంత్తేరాస్‌పైనే తాము దృష్టి సారిస్తున్నామని, గోల్డ్ ధరలు మరింతపైకి దూసుకుపోతే రిటైల్ జ్యూయలరీ మార్కెట్‌కు మరింత కష్టాలు తప్పవని ఆయన వెల్లడించారు.
గత సంవత్సరంమే దేశీయ మార్కెట్లో బంగారం అమ్మకాలు లేక హోల్‌సేల్ వ్యాపారులు తమ దగ్గర ఉన్న 20 మెట్రిక్ టన్నుల బంగారాన్ని లండన్ గోల్డ్ డెలివరీ బార్స్‌కు కన్‌వర్షెన్ చేశారని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. భారత్ ఏటా 700 నుంచి 800 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నదని, తొలి సారిగా భారత్ హోల్‌సేల్ వ్యాపారలు తమ వద్దనున్న నిల్వలను ఎగుమతి చేయడం విశేషమని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
చమురు ధరలు మళ్ళీ తారా స్థాయికి చేరు కోవడంతో దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే ఆర్థికమాంద్యంతో ఆటో, ఇంజనీరింగ్ తదితర వ్యాపారాలు చతికిల పడ్డాయి. తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ 60 డాలర్లకుపైగా పెరగడం విడ్డూరంగా ఉందని, ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో చమురు ధరలు పెరగడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు శ్రేయస్సుకరం కాదని నిపుణులుసైతం హెచ్చరిస్తూన్నారు. గతంలో చమురు ధరలు రికార్డ్ స్థాయిలో బ్యారెల్ 140 డాలర్లకుపైగా దూసుకుపోవడం విశేషం. చమురు ధరలు మండడంతో వీటి ప్రభావం సామాన్యుడిపై మరింత భారం పడుతుందని, ఇప్పటికే రిటైల్ మార్కెట్లో నిత్యవసర ఆహార వస్తువుల ధ రలు చుక్కలనంటాయి. వీటికి చమురు భారం కూడా తోడైతే పరిస్థితి మరింత విషమిస్తుందని ఆర్థిక నిపుణులు పాలకులను హెచ్చరిస్తున్నారు.
Pages: -1- 2 News Posted: 23 May, 2009
|