సంతానంపై 'కరుణ'
చెన్నై : కేంద్రంలో కొత్త ప్రభుత్వం స్థాపనకు ముందు మంత్రి పదవులపై సమస్యలు తలెత్తడానికి వ్యర్థ రాజకీయాలు కాకుండా మూడు కుటుంబాల ఒత్తిడి కారణం. రాజకీయ జీవితం చివరి దశలో ఉన్న, తమిళనాడు వృద్ధ రాజకీయ నేత ఎం. కరుణానిధి రెండు కుటుంబాలు, ఆ మాటకు వస్తే మూడవ కుటుంబం అదే మృతి చెందిన తన మేనల్లుడు మురసోలి మారన్ కుటుంబం మధ్య సమతూకం పాటించవలసి వచ్చింది. శుక్రవారం పూర్తి స్థాయి కేంద్ర మంత్రివర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించాలనే ప్లాన్ కు భంగం వాటిల్లుతుందని తెలిసినా కరుణానిధి అలా చేయవలసి వచ్చింది.
తన పెద్ద కుమారుడు ఎం.కె. అళగిరికి, కుమార్తె కనిమొళికి కేంద్ర మంత్రివర్గంలో స్థానాలు కల్పించాలని ఒత్తిడి చేసేందుకు కరుణానిధిని పురికొల్పుతున్నది తండ్రి ప్రేమే కాకుండా ఆ పిల్లల తల్లుల ఆకాంక్షల కూడా. తన పెద్ద కుమారుడు అళగిరిని మంత్రిని చేయాలన్న తన రెండవ భార్య దయాళు (75) ఒత్తిడి, తన ఏకైక కుమార్తె కనిమొళి తరఫున వకాల్తా పుచ్చుకున్న రాజాత్తి (64) ఒత్తిడి ఫలితంగా 86 సంవత్సరాల డిఎంకె అధినేత ఎం. కరుణానిధి ఢిల్లీలో మరిన్ని పదవుల కోసం పట్టుబట్టవలసి వచ్చింది. ఎందుకంటే ఆయన భార్య దయాళుకు అళగిరి ఆమె ప్రథమ సంతానమే కాకుండా అత్యంత అభిమాన పుత్రుడు కూడా.
2001 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తిరుగుబాటు అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా డిఎంకె అవకాశాలకు హాని కలిగిస్తున్నందుకు అళగిరిపై కరుణానిధి మండిపడుతున్నప్పుడు తన కుమారుని గురించి తన భర్త వద్ద వాదించి, డిఎంకె రాజకీయాలలో అతనికీ సమానావకాశం కల్పించాలని కోరింది దయాళునే. ఇక కరుణానిధి కాబోయే వారసుల గురించి నిర్వహించిన ఒపీనియన్ పోల్ ఫలితాన్ని మారన్ కుటుంబం యాజమాన్యంలోని 'దినకరన్' పత్రిక నిరుడు ప్రచురించినప్పుడు అళగిరి మద్దతుదారులు పత్రిక కార్యాలయానికి నిప్పంటించినప్పుడు తన కజిన్ల (మారన్ సోదరుల) పట్ల ఉదార వైఖరిని విడనాడి తన అన్నకు అండగా నిలిచేట్లుగా రెండవ కుమారుడు ఎం.కె. స్టాలిన్ పై ఒత్తిడి తీసుకువచ్చింది కూడా దయాళునే. 'నాకు ఏమైనా కావలసి వస్తే నేను మా అమ్మగారితో చెబుతా. ఆమె సరైన సమయంలో ఆ విషయం మా తండ్రి చెవిన వేస్తారు' అని అళగిరి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Pages: 1 -2- -3- News Posted: 23 May, 2009
|