సంతానంపై 'కరుణ'
రెండు సంవత్సరాల క్రితం కనిమొళి స్వయంగా అళగిరితో సత్సంబంధాల కోసం ప్రయత్నించారు. అయితే, ఆయన తన కుమార్తె కయల్ విళిని పైకి తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించడంతో కనిమొళి వెనుకకు తగ్గారు.
మారన్ లు కరుణానిధి కుటుంబంతో రాజీ పడినప్పటికీ, మారన్ సోదరులతో కనిమొళి సంబంధాలు ఇంకా అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. 'స్పెక్ట్రమ్ కుంభకోణం' సమయంలో వారు తనను ఒక లబ్ధిదారుగా పరిగణిస్తున్నట్లుగా ఆమె అనుమానించారు. డిఎంకె నేత ఎ. రాజా ఆధ్వర్యంలోని కమ్యూనికేషన్ల మంత్రిత్వశాఖ నిర్వహించిన టెలికామ్ 2జి లైసెన్సుల వేలం వివాదాస్పదమైన విషయం విదితమే.
కనిమొళి రాజకీయ బాధ్యతలు నిర్వర్తిస్తుంటే చూడాలనేది రాజాత్తి ఆశయం. 2007 మే నుంచి కనిమొళి కేంద్రంలో మంత్రి పదవి కోసం నిరీక్షిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల అనంతరం స్టాలిన్ ను ఉప ముఖ్యమంత్రిగా కరుణానిధి నియమించవలసి ఉంది. కాని ఈ ప్రక్రియకు ముందు ఢిల్లీలో అళగిరి, కనిమొళి, దయానిధి స్థానాలను సుస్థిరం చేయాలని ఆయన కోరుకుంటున్నారు.
కాగా, ఈ కుటుంబ వివాదాల వల్ల ఎక్కువగా సతమతమయింది మాత్రం స్టాలిన్. ఆయన గడచిన రెండు సంవత్సరాలుగా తన తండ్రి భారాన్ని చాలా వరకు మోశారు. 'కరుణానిధిని అళగిరి, కనిమొళి తమ తండ్రిగా చూస్తుండగా, డిఎంకెలో చాలా కాలంగా రాజకీయ బాధ్యతలను నిర్వహించిన కారణంగా స్టాలిన్ సొంత తండ్రిని ఒక నేతగాను, తనను విధేయుడైన ఒక కేడర్ గాను పరిగణించుకోవడానికి క్రమంగా అలవాటు పడ్డారు' అని సీనియర్ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు.
Pages: -1- -2- 3 News Posted: 23 May, 2009
|