వడ్డీ రేటు తగ్గించండి
ఈ నెలాఖరు నాటికి తమ బ్యాంకు వడ్డీరేట్లను తగ్గిస్తుందని దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు ఎస్‌బిఐ చైర్మన్ ఒ.పి.భట్ ప్రణబ్ ముఖర్జీతో సమావేశమ పూర్తయిన అనంతరం తెలిపారు. బ్యాంకుల నుంచి అను కూలమైన రేటుకు రుణాలు లభించకపోవడంపై ప్రణబ్ ముఖర్జీ ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆర్థిక మధ్య వర్తిత్వంగా బ్యాంకులు అనుకూలమైన రేట్లతో రుణాలను ఇవ్వాలని అన్నారు. బ్యాంకుల ప్రైమ్ లెండింగ్ రేట్ల తగ్గింపులో ఆర్‌బిఐ ప్రభావం ఉండదని అన్నారు. వడ్డీరేట్లను తగ్గించి, రుణాలను అందుబాటులోకి తేవాలని అన్నారు. ఇది దేశ ఆర్థిక వృద్ధిరేటుకు వేగవంతం చేస్తుందని, ఈ వృద్ధితో ప్రజలకు ఫలాలు అందుతాయని ప్రణబ్ చెప్పారు. ఎంతమేర వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉందని ప్రశ్నించగా ప్రణబ్ స్పందిస్తూ, సామర్థ్యం మేరకు ఉంటుందని, సరిగ్గా సంఖ్యను చెప్పలేమని అన్నారు.
కెనరా బ్యాంకు కూడా భారతీయ స్టేట్ బ్యాంకు చెప్పిన వ్యాఖ్యలకు అనుకూలంగా స్పందించింది. దేశంలో రెండో అతిపెద్ద బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు అంతగా స్పందించలేదు. ఇప్పటికే మార్కెట్‌లో రేటు తక్కువగా ఉండడం వల్ల తిరిగి ఆలోచించేది లేదని తెలిపింది. ప్రధాని మన్మోహన్‌సింగ్ లోక్‌సభలో దేశ ఆర్థిక వృద్ధిరేటు వచ్చే సంవత్సరాల్లో 8-9 శాతం వృద్ధిని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన నేపథ్యంలో బ్యాంకులు వడ్డీరేట్ల తగ్గింపు ప్రాధాన్యతను సంతరించుకుంది. బిజినెస్‌కు రుణాలను మరింత రేటు అందివ్వాలని, ప్రైమ్ లెండింగ్ రేట్లు సింగిల్ డిజిట్‌కు తగ్గించాలని పారిశ్రామిక వేత్తలు బ్యాంకులకు విజ్ఞప్తి చేశాయి. ప్రస్తుతం ప్రైమ్ లెండింగ్ రేటు 12.75 - 13.25 శాతం ఉంది. ఆర్థికంగా భారత్ అనేక సవాళ్లను ఎదుర్కొందని, ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక వృద్ధిరేటును మొత్తానికి వృద్ధి దిశగా నడిపించాలన్న లక్ష్యంతో ఉందని ప్రణబ్ ముఖర్జీ అన్నారు. మార్కెట్ అంచనాల ప్రకారం భారత్ 6.7 శాతం ఆర్థిక వృద్ధిని నమోదు చేసిందని అన్నారు.
Pages: -1- 2 News Posted: 10 June, 2009
|