ఐఫోన్ల రేట్లు తగ్గవు
ఇండియాలో ఐఫోన్లు ఎక్కువ ఖరీదైనవిగా ఎందుకు ఉంటాయంటే అమెరికాలో వినియోగదారులకు అక్కడ హాండ్ సెట్ ల ఏకైక పంపిణీదారు ఎటి అండ్టి సంస్థ నుంచి చెప్పుకోదగిన స్థాయిలో సబ్సిడీ ధరకు ఐఫోన్లు లభిస్తుంటాయి. ఈ సర్వీస్ కోసం వినియోగదారులు ఎటి అండ్ టితో రెండేళ్ళ సర్వీస్ కాంట్రాక్టుపై సంతకం చేయవలసి ఉంటుంది. యుకెలో ఈ ఫోన్ ను ఒ2 సంస్థ ఉచితంగా ఇస్తుంది. జర్మనీలో టి - మొబైల్ సంస్థ ఒక యూరో (రూ. 76) రేటుకు ఈ ఫోన్ ను విక్రయిస్తుంది.
ఇండియాలో భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్ - ఎస్సార్ సంస్థలు హాండ్ సెట్లను సబ్సిడీ ధరలకు విక్రయించవు. ఎందుకంటే, వినియోగదారులు పెనాల్టీ నిబంధనలను ఖాతరు చేయరు. దానితో సుదీర్ఘ కాలం కోర్టులో దావాలు నడుస్తుంటాయి. పైగా ఇండియాలో అసంఘటిత రంగంలోని రీటైల్ దుకాణాలు హాండ్ సెట్ల ఆపరేటర కోడ్ ను ఛేదించగలుగుతున్నాయి. దానితో చౌకగా యుఎస్ నుంచి 'దిగుమతి' చేసుకున్న హాండ్ సెట్లను కూడా ఉపయోగించవచ్చు. ఫలితంగా ఐఫోన్లకు సబ్సిడీ ఇవ్వడం ఆపరేటర్లకు ఆర్థికంగా లాభసాటిగా కనిపించడం లేదు.
ఇది ఇలా ఉండగా, ఇండియాలో ఐఫోన్ ఉత్సాహపరులకు ఒక శుభవార్త. ఏపిల్ సంస్థ ఐఫోన్ 3జిఎస్ సెట్లను ఆగస్టు 9న ప్రవేశపెట్టనున్నది. దీనిని 'అత్యంత వేగమైన, శక్తిమంతమైన ఐఫోన్'గా పేర్కొంటున్నారు.
Pages: -1- 2 News Posted: 12 June, 2009
|