తగ్గిపోతున్న క్రెడిట్ కార్డులు
తమ క్రెడిట్ కార్డు పోర్ట్ ఫోలియోలతో తలెత్తిన ఇబ్బందుల కారణంగా చాలా వరకు బ్యాంకులు ప్రస్తుత సంబంధాలు ఉన్న కస్టమర్లకు మాత్రమే కొత్త కార్డులు జారీ చేయడమనే విధానాన్ని అనుసరిస్తున్నాయి. 'అందరూ ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఇప్పట్లో ఈ పరిస్థితి మారుతుందని నేను అనుకోవడం లేదు' అని ఒక ప్రైవేట్ రంగ బ్యాంక్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
క్రెడిట్ కార్డు సంస్థలు తమ క్రెడిట్ కార్డ్ పోర్ట్ ఫోలియోలను హేతుబద్ధం చేసుకుంటున్నాయని, కొన్ని నెలల పాటు ఈ విధానం కొనసాగగలదని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ లో క్రెడిట్ కార్డుల విభాగం అధిపతి ఆర్.ఎల్. ప్రసాద్ తెలియజేశారు. 'పరిశ్రమ పరిస్థితి మెరుగవుతుంటే ఈ కుదింపు పరిమాణం తగ్గుముఖం పట్టవచ్చునని నా భావన' అని ఆయన తెలిపారు.
చెల్లింపుల ఎగవేతలు వంటి సమస్యలు తక్కువ స్థాయిలో ఉన్న క్రెడిట్ కార్డుల విభాగంపైకి చాలా బ్యాంకులు దృష్టిని మరల్చాయి. ఈ రంగంలో పోటీ తీవ్రం కావచ్చు. 'ఈ రంగంలో పోటీ పెరిగే అవకాశం ఉండడంతో ప్రమాణాలు కీలకం కాగలవు. సంస్థలు తమ కార్డు ప్రతిపాదనలకు మరిన్ని, మెరుగైన ఆఫర్లను చేర్చగలవు. ఈ సేవలలో కొన్ని ఫీజుకు అందుబాటులోకి రావచ్చు. ఫరవాలేదు అనుకుంటే ఈ సర్వీసులకు డబ్బు చెల్లించడానికి కస్టమర్లు సిద్ధంగా ఉంటారని మా అనుభవంలో తేలింది' అని ఆర్.ఎల్. ప్రసాద్ చెప్పారు.
Pages: -1- 2 News Posted: 12 June, 2009
|