`ఆనందం' రీప్లే
మకావు : నాలుగు దశాబ్దాల `ఆనందం' ఒక్కసారిగా ప్రపంచ ప్రేక్షకులకు కళ్లకు కట్టింది. బాలీవుడ్ తొట్టతొలి సూపర్ స్టార్ అనంతరం మూడు దశాబ్దాల పాటు హిందీ సినిమాకు మారుపేరుగా మారిన మరో సూపర్ స్టార్లు కలిసిన మధుర క్షణమిది. ఇద్దరూ ఆ ఆనందాన్ని పంచుకున్నారు. ప్రేక్షకులూ వారి కలయికతో మంత్రముగ్దులయ్యారు.
`ఇత్నా ప్యార్ అచ్చా నహీ, బాబూ మోషే. హం సభి రంగ్ మంచ్ కి కత్పుతిలియా హై..' ఈ ఒక్క డైలాగ్ తో ఐఐఎఫ్ఎ అవార్డు వేదిక మీద `ఆనంద్' సినిమా రీళ్ళురీళ్ళుగా కనిపించింది. అప్పుడెప్పుడో రుషికేష్ ముఖర్జీ చెక్కిన కొత్త శిల్పంలోకి ఒదిగిపోయిన రాజేష్ ఖన్నా - `ఆనంద్' సీక్వెల్ లో కొత్త పాత్ర పోషిస్తున్నాడన్నంత భావోద్వేగంతో చెప్పిన డైలాగ్ ఆనంద్ సన్నివేశాల్ని కళ్ళముందు సాక్షాత్కరింపచేశాయి. అదే ఆంగికం, అదే వాచకం, వేదికమీద ఖన్నా సరసన అదే బాబూ మోషే (అమితాబ్ బచ్చన్). ఆనంద్ సినిమాలోని సన్నివేశ దృశ్యాలను రియల్ గా చూస్తున్నట్టే భావోద్వేగానికి గురయ్యారు మకావు అభిమానులు.
అభిమానులంతా కాకా అని ముద్దుగా పిలుచుకునే బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా తను అభిమానించే బాబూ మోషే చేతుల మీదుగా ఐఐఎఫ్ఎ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు అందుకున్నారు. అవార్డు తీసుకునే సమయంలో వేదిక మీద కనిపించిన దృశ్యాలను చూసి అభిమానులు ఆనంద్ సినిమా చూస్తున్నట్టు ఫీలయ్యారు. అభిమాన నటుడు రేజేష్ ఖన్నాకు 66 ఏళ్ళ వయసులో జరుగుతోన్న అపురూప సత్కారానికి పొంగిపోయారు.
Pages: 1 -2- News Posted: 15 June, 2009
|