`ఆనందం' రీప్లే
తన నటనతో బాలీవుడ్ సినిమాకు కొత్తబాష్యం చెప్పిన రాజేష్ ఖన్నా, 66 ఏళ్ళ వయసులో కూడా అదే ఆంగికాన్ని,అంతే బలమైన వాచకాన్ని ప్రదర్శించడం అవార్డు కార్యక్రమాన్ని తిలకించిన 12 మంది ప్రేక్షకులను విస్మయపర్చింది.- `40 ఏళ్ళ నా సినీ ప్రస్థానంలో 180 చిత్రాలు చేసిన ఆనందానికి మించిన `ఆనంద'మిది. ఈ సత్కారంతో అభిమానులు, సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాను. ముఖ్యంగా బాబూ మోషే (అమితాబ్ బచ్చన్)కు' అంటూ వేదిక మీద రాజేష్ ముక్తసరిగానే మాట్లాడినా, ఆనంద్ సినిమా డైలాగుల్లా ప్రేక్షకుల గుండెల్లోకి దూసుకుపోయాయి.
`జీవితం చాలా పెద్దగా కాదు, ఉన్నతంగా ఉండాలి. అలాంటి ఉన్నతమైన జీవితాన్ని బాబూ మోషే అనుభవిస్తున్నాడు. మహరాజు అంత గొప్పగా. ఆనంద్ సినిమా నుంచి మా ప్రయాణం ఆరంభమైంది. ఇప్పుడు ఈ వేదిక మీద కలిసే ఉన్నాం. అతను నాకు ప్రాణం. అతనే బాబూ మోషే' అంటూ అవార్డు అందచేసిన అమితాబ్ తో తన స్మృతులను రాజేష్ గుర్తు చేసుకున్నప్పుడు అభిమానులు పులకించి హర్షద్వానాలు ప్రకటించారు. పాత స్మృతులను రాజేష్ గుర్తు చేసుకుంటూ `ఇత్నా ప్యార్ అచ్ఛా నహీ...' అంటూ రాజేష్ గుర్తు చేసుకున్న ఆనంద్ డైలాగులకు అభిమానులు నీరాజనాలే పట్టారు.
`నా జీవితం ఎక్కడో ఆరంభమైంది. ఇప్పటికి ఈ గమ్యానికి చేరుకుంది. ఇదంతా నేను ఆరాధించే దేవుడు, నా అభిమానులు నాకు కల్పించిన అవకాశం, అతను (అమితాబ్) నాకు బ్రాండ్ అంబాసిడర్ కాదు, ఎందుచేతనంటే నాకు స్నేహితుడు కనుక. ఈరోజును నేను ఇక్కడున్నానంటే అందుకు కారణం అభిమానులు, అమితాబ్ నాకు ఇచ్చిన అవకాశమే. అలా అందివచ్చిన అవకాశమే నటుడిగా నాకు ఇంత ఉన్నత స్థానం దక్కింది' అని రాజేష్ కృతజ్ఞతలు చెప్పుకున్నారు. తన నటనా కౌశలాన్ని ప్రదర్శించి కాకాగా ఉన్నతమైన స్థానాన్ని అందుకున్న రాజేష్ ఖన్నా సినీ జీవితంలో ఆనంద్, అమర్ ప్రేమ్, ఆరాదన, కటిపతంగ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీలను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.
బాలీవుడ్ స్టార్ వాల్ట్స్ వహీదా రెహమాన్, ఆషా ప్రకాష్, యాష్ చోప్రా, ధర్మేంద్ర, ముంతాజ్ లాంటి సినీ ఘనాపాఠీలకు అందిన ఐఐఎఫ్ఎ అవార్డు ఇప్పుడు రాజేష్ కన్నా సైతం అందుకుని వారి సరసన చేరారు.
Pages: -1- 2 News Posted: 15 June, 2009
|