మైనస్ ద్రవ్యోల్బణం
గత ఏడాది జూన్ నాటికి ఒక బ్యారెల్ 140 డాలర్లకు చేరుకున్న అంతర్జాతీయ ముడి చమురు ధర 70 డాలర్లకు క్షీణించడంతో ఇంధన సూచి 13 శాతం క్షీణించింది. పర్యవసానంగా ద్రవ్యోల్బణం వేగంగా క్షీణించిందని ఆర్ధికవేత్తల విశ్లేషణ. ఫర్నేస్ ఆయిల్, నాఫ్తా ధరలు 7 శాతం పెరిగిపోయాయి. డీజిల్ ఆయిల్ 4 శాతం పెరిగింది. ఉప్పు ధర 10 శాతం పెరిగింది. పంచదార ధర ఒక్క శాతం పెరిగింది. గుడ్లు ధర 3 శాతానికి పెరిగిపోయింది. 1975లో ఎమర్జన్సీ చీకటి రోజుల్లో ద్రవ్యోల్బణం ఇలానే క్షీణించింది. దాంతో ఆనాటి వస్తూత్పత్తి రంగం ఘోరంగా దెబ్బతింది. ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేయలేక అలమటించారు. చేతిలో తగినంత డబ్బులేని పరిస్థితి తాండ వించింది. జన జీవనం అస్తవ్యస్తమైంది. ఆనాటి చీకటి రోజులు తిరిగి అలము కోనునున్నాయా? అని పలువురు ఆర్ధికవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
ద్రవ్యోల్బణానికి ధరలకు లంకె లేదా?
ధరలు పెరగడానికి కారణం ద్రవ్యోల్బణం పెరగడంగా ఇప్పటివరకు ప్రజలకు వివరిస్తున్న ప్రభుత్వ ఆర్ధికవేత్తలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి నేడు తలెత్తింది. ద్రవ్యోల్బణం మైనస్ విలువకు క్షీణించినప్పటికీ ధరల వడి తగ్గక పోవడం పట్ల తర్జనభర్జన పడుతున్నారు. గత ఏడాది ఆగస్టు నాటికి ద్రవ్యోల్బణం 13శాతం అత్యున్నత స్థాయికి చేరి, అనూహ్యమైన వేగంతో క్షీణిం చింది. ద్రవ్యోల్బణానికి సమాంతరంగా నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగి పోయాయి. అయితే ద్రవ్యోల్బణంతో పాటు క్షీణించకుండా ఆలాగే నిరంతరాయంగా పెరిగిపో తున్నాయి. ఆర్ధికవేత్తలు చెబుతున్నట్లు ద్రవ్యో ల్బణం క్షీణిండంతోపాటు టోకు ధరలు (హోల్ సేల్ ప్రైజస్) తగ్గిపోతున్నాయి. అయితే మార్కెట్‌లో వినియోగదారునికి అందుకునే చిల్లర ధరలు (రిటైల్ ప్రైజస్)పై ద్రవ్యోల్బణ క్షీణత ప్రభావం పడటంలేదు.అభివృద్ధి చెందిన దేశాలన్నీ వినియోగదారుల ధర సూచీ (కన్స్యూమర్ ప్రైజ్ ఇండెక్స్ -సీపీఐ) ఆధారంగా ద్రవ్యోల్బణాన్ని అంచనా వేస్తున్నాయి.
అందువల్ల ద్రవ్యోల్బణంలో మార్పులు ప్రజల దైనందిన వస్తువుల ధరల్లో కనబడుతాయి. అయితే భారత్‌లో అందుకు భిన్నంగా టోకు ధరల సూచిక (డబ్ల్యూపీఐ) ఆధారంగా ద్రవ్యోల్బణాన్ని లెక్కవే స్తుండడంతో దాని పెరుగుదల ప్రభావం వినియోగదారులపై పడుతుందేగాని, దాని క్షీణత ప్రభావం వినియోగదారలుకు చేరని పరిస్థితి నెలకొంది. ద్రవ్యోల్బ ణం క్షీణత వల్ల ఏర్పడిన ధరల తగ్గుదల ప్రభావం టోకు వ్యాపారస్తులకు మాత్రమే పరిమితమైంది.అది వినియోగదారునికి చేరడంలో ప్రభుత్వం చొరవ చూపించవలసి ఉంటుంది. అలాంటి ప్రభుత్వ ప్రయత్నాలు కొరవడటంతో వినియోగదారుల ధరల సూచీ గత ఏడాది నాటి 10 శాతం స్థాయిల్లోనే కొన సాగుతున్నట్లు నిపుణుల అంచనా. ప్రభుత్వం సీపీఐ గణాంకాను ఎప్పటి కప్పుడు లెక్కగట్టడం కూడా వదిలివేసిన దుస్థితి దాపురించింది. ద్రవ్యోల్బణానికి ధరలకు లంకె ఉంది, జాతీయ-అంతర్జాతీయ ఆర్ధిక పరిస్థితులతోపాటు ఆయా ప్రభుత్వాల వైఖరి కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
Pages: -1- 2 -3- -4- News Posted: 19 June, 2009
|