మైనస్ ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా మైనస్ 1.61 శాతా నికి ద్రవ్యోల్బణం క్షీణించింది. ద్రవ్యోల్బణం అనూహ్యంగా క్షీణించి నప్పటికీ నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం భరించలేనంత రీతిలో పెరుగుతున్నాయి. భారత దేశంలో ద్రవ్యోల్బణాన్ని టోకు ధరల సూచీ (హోల్‌సేల్ ప్రైజ్ ఇండెక్స్- డబ్ల్యూపీఐ) ఆధారంగా అంచనా వేస్తారు. జూన్ 6 వారాంతానికి ఆ సూచీ 232.7 పాయింట్లకు క్షీణించింది. దాంతో ప్రపంచ ప్రముఖ ఆర్ధిక వ్యవస్థల్లో ఒకటైన భారత్ ఆర్ధికవ్యవస్థ మాత్రమే ద్రవ్య సంకోచం (డిఫ్లేషన్) పరిస్థితుల్లోకి వెళుతున్నట్లు ఆర్ధికవేత్తలు విశ్లేషిస్తున్నారు.
యూరోపియన్ మార్కెట్‌తో సహా పలు అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలన్ని సున్నా ద్రవ్యోల్బణం స్థాయిలకు చేరువలోనే ఉన్నాయి. దేశంలో నెలకొన్న ఈ పరిణామాన్ని స్టాక్ మార్కెట్లు తక్షణమే ఆహ్వానించాయి. గురువారం ఉదయం పేలవంగా ప్రారంభమైన స్టాక్ మార్కెట్, ప్రభుత్వ ద్రవ్యోల్బణ నివేదికతో 200 పాయింట్ల మేర పురోగతి సాధించింది. ద్రవ్యోల్బణ క్షీణతతో వడ్డీరేట్లు మరింతగా తగ్గేందుకు దోహదం చేస్తుందని మార్కెట్ వర్గాలు సంతోషిస్తున్నాయి. ద్రవ్యోల్బణం క్షీణించినప్పటికీ ఆహార పదార్థాల ధరలు గత ఏడాది ఇదే వారంతో పోలిస్తే 8.7 శాతం ప్రియంగా ఉన్నాయి. పప్పు దినుసులు 17 శాతం, తృణ ధాన్యాలు 13.5శాతం, పళ్లు, కూరగాయల ధరలు 10 శాతంపెరిగాయి.
Pages: 1 -2- -3- -4- News Posted: 19 June, 2009
|