మైనస్ ద్రవ్యోల్బణం
ద్రవ్య సంకోచమా? ప్రతి ద్రవ్యోల్బణమా?
సరకుల ధరలు, ఉద్యోగాలు, ఆదాయాలు నిరంతరాయంగా క్షీణించడం, ఆర్ధిక పరిస్థితి మరింతగా కుదించుకుపోయి, సరకుల ధరలు అత్యంత వేగంగా కుప్పకూలిపోతాయి. ప్రజలు ఖర్చు పెట్టడం మానివేస్తారు. ధరలు ఇంకా తగ్గు తాయని కలలు కంటారు. ఈ స్థితిని ద్రవ్య సంకోచంగా (డిఫ్లేషన్)గా పిలు స్తారు. భారత దేశం ఇలాంటి దయనీయమైన స్థితిలోకి జారిందా? నిపుణులు అలా జరగలేదంటున్నారు. నేడు నెలకొన్న పరిస్థితులు ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థి తులేగాని (డిస్ ఇన్‌ఫ్లేషన్) ద్రవ్యసంకోచ పరిస్థితులుకావని వారు విశ్లేషిస్తు న్నారు. టోకు ధరల సూచి తగ్గుతున్నప్పటికీ వినియోగదారుల సూచి ఇప్పటికీ అత్యున్నత స్థాయిలో ఉంది. ధరల తగ్గుదలలో అనిశ్చితి కొనసాగుతున్నంత కాలం ఈ పరిస్థితిని ప్రతి ద్రవ్యోల్బణం అని పిలుస్తాము. అమెరికా, పశ్చిమ యూరప్, జపాన్ దేశాల్లో ద్రవ్యోల్బణం అపసవ్యంగా నడవడమే కాదు, వాటి ఆర్ధిక వ్యవస్థలు కుంచించుకు పోవడంతో ఆ దేశాలు ద్రవ్య సంకోచంలోకి జారిపోయాయి. అక్కడి ప్రభుత్వాలు ద్రవ్య సంకోచాన్ని ఎదుర్కొనేందుకు వేల కోట్ల డాలర్లను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి.
Pages: -1- -2- -3- 4 News Posted: 19 June, 2009
|