మైనస్ ద్రవ్యోల్బణం
ఇది మంచికా? చెడ్డకా?
ద్రవ్యోల్బణం భరించలేనంతగా పెరిగినప్పటికీ, తరగినప్పటికీ కొందరు ఘరానాలు సొమ్ము చేసుకోలుగుతారు. సామాన్యులు మాత్రం బాధితులుగా మిగులుతారు.విలాస వస్తువుల వినియోగదారులు, పొదుపుదారులకు ఈ ప్రతి- ద్రవ్యోల్బణ పరిస్థితి (డిస్ ఇన్లే్ఫషన్) వరంగా పరిణమించింది. రుణ గ్రహీతలకు ఇది శుభవార్తగా మారింది. తాజా రుణాలు చౌకగా లభిస్తాయి. అయితే గతంలో తీసుకున్న రుణాలకు చెల్లించే స్థిర వాయిదాల విలువ అధిక మవుతుంది. అదే సమంయంలో ప్రతి ద్రవ్యోల్బణం ఉత్పత్తిదారులకు అశని పాతంగా మారుతుంది. ఆయిల్, మెటల్, సిమెంట్, ఆటోమొబైల్ రంగాలు గతంలో సాధించిన లాభాలు ప్రస్తుత ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో కుంటు పడుతాయి.
పలు రంగాల ఉత్పత్తుల టోకు ధరలు తగ్గడంతో ఉత్పత్తి విస్తరణ కార్యక్రమాలు కుంటుపడటమే కాదు, సగటు ఉత్పత్తి సైతం కుంటుంపడింది. ద్రవ్యోల్బణం అపసవ్య దిశలోకి మళ్లితే, ధరలు పెరగడం నిలిచిపోతాయి. వాస్తవంలో టోకు వ్యాపారస్తుల స్థాయిలో ధరలు పడిపోతాయి. ఈ ధరల తగ్గుదల వినియోగదారలకు చేరకపోవడం శోచనీయం. దాంతో కొనుగోలు శక్తి కోల్పోయిన విస్తృత ప్రజానీకం సమాజంలో తలెత్తుతుంది. దీని ప్రభావం తిరిగి వస్తూత్పత్తిపై పడుతుంది. ఆర్ధిక వ్యవస్థ మరింతగా మందగించి సంక్షోభం దిశగా పరుగులేస్తుంది. వినియోగదారుల సూచి ఆధారంగా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసి, దాని ఫలాలు వినియోగదారలకు చేరితే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. తద్వారా ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడుతుంది.
Pages: -1- -2- 3 -4- News Posted: 19 June, 2009
|