మరో 80 `మోర్' స్టోర్స్
మార్చితో ముగిసిన ఏడాదిలో కంపెనీ 1,150 కోట్ల రూపాయల అమ్మకం టర్నోవర్ సాధించింది. 2007 ఆరంభంలో దక్షిణాదికి చెందిన త్రినేత్ర సూపర్ మార్కెట్లను తీసుకోవడం ద్వారా వ్యాపారం ప్రారంభించిన ఆదిత్య బిర్లా రిటైల్ తమ నెట్ వర్క్ ను ఇరవై నెలల్లో 710 స్టోర్లకు పెంచుకుంది. శుద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా గత ఆరు నెలల్లో వాటిలో 76 స్టోర్లను మూసివేశారు. గత ఎనిమిది నెలలు పరిశ్రమకు జాగృతి కలిగించిన కాలమని, ఈ ఏడాది బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఔరంగాబాద్, ఇండోర్, ముంబయి, బెంగుళూరులలో ఒక్కో హైపర్ మార్కెట్ ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రకటించింది.
అద్దెలు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నామని, ఇందుకు చర్యలు జరుగుతున్నాయని, అద్దె తగ్గకపోతే బరోడా హైపర్ మార్కెట్ ను మూసివేస్తామని వర్గీస్ తెలిపారు. బరోడా 85వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైపర్ మార్కెట్ ఏర్పాటు చేశారు. ఇక ముందు 65వేల నుంచి 70 వేలకు మించి హైపర్ మార్కెట్ ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని అన్నారు. ప్రస్తుతం 13 రాష్ట్రాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీ చిన్న చిన్న నగరాలు, పట్టణాలకు విస్తరించడం ద్వారా ఆయా రాష్ట్రాలలో పూర్తిగా విస్తరించాలని కంపెనీ భావిస్తోంది. కొత్త సూపర్ మార్కెట్లను దక్షిణాదిలో తెరుస్తారు. దక్షిణాది స్టోర్స్ లాభాలకు చేరువలో ఉన్నాయని వర్గీస్ వెల్లడించారు. కాగా వాటాలను అమ్మే ఉద్దేశంలేదని, భాగస్వాముల కోసం చూడటం లేదని ఆయన అన్నారు.
Pages: -1- 2 News Posted: 22 June, 2009
|