ప్రత్యక్ష పన్నుల ప్రక్షాళన
ఈ కొత్త చట్టంలో భాష చాలా సరళంగా, సవివరంగా ఉంటుందనీ, ప్రస్తుత చట్టంలో ఉన్న గందరగోళం ఉండదనీ, సులువుగా అమలు చేయడానికి వీలు కల్పిస్తుందనీ, సమర్థవంతమైందని ప్రణబ్ చెప్పారు. అంతర్జాతీయంగా అమలులో ఉన్న పన్ను విధానాలు, అందరూ ఆమోదించిన సిద్ధాంతాలు ప్రాతిపదికగా ఈ కొత్త ప్రత్యక్ష పన్ను కోడ్‌ను రూపొందించామని ఆర్థికమంత్రి చెప్పారు. క్రమంగా ఇది ఏకీకృత పన్ను విధానానికి బాట వేస్తుం దన్నారు. ఇది నేటి యువతరం ఆశలకు అనుగుణంగా ఉంటుంద న్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం కొత్త కోడ్ పై ముసాయిదా బిల్లును ప్రవేశపెడుతుందని ప్రణబ్‌ముఖర్జీ అన్నారు.
-ఏడాదికి లక్షా 60 వేల రూపాయల ఆదాయం ఉన్న సాధారణ పౌరుడికి కొత్త కోడ్ ఆదాయపు పన్ను మినహాయింపును ప్రతిపాదించింది. కొత్త కోడ్ అమలులోకి వస్తే పది లక్షల రూపాయల వార్షికాదాయం ఉంటే పది శాతం పన్ను చెల్లించాలి.
-25 లక్షల రూపాయల ఆదాయం ఉంటే 20 శాతం, 25 లక్షల పైబడి ఆదాయం ఉంటే ఏడాదికి 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
- ప్రస్తుత ఏడాదికి రూ. లక్షా 60 వేల ఆదాయం ఉన్న వ్యక్తి పన్ను చెల్లించక్కర్లేదు.
- కానీ, ఆ పరిమితి దాటితే అంటే లక్షా 60 వేల నుంచి మూడు లక్షల వరకు ఆదాయం ఉంటే పది శాతం, మూడు లక్షల నుంచి అయిదు లక్షల ఆదాయం వరకు 20 శాతం, అయిదు లక్షలు దాటితే 30 శాతం ఆదాయం పన్ను చెల్లించాల్సి వస్తోంది.
-2000 ఏప్రిల్ 1 కంటే ముందున్న అన్ని కేపిటల్ గెయిన్స్ పైన పన్ను మినహాయించాలన్న ప్రతిపాదన ఉంది.
-వివాదాస్పదమైన సెక్యూరిటీస్ ట్రాన్స్‌యాక్షన్ టాక్స్ రద్దవుతుంది.
-పన్నుకు ఉద్యోగి పొందే ప్రయోజనాలన్నీ వేతనాదాయంగానే పరిగణిస్తారు.
-రిటైరైన తర్వాత వచ్చే బెనిఫిట్స్‌కు ఆదాయం పన్ను మినహాయింపు లభిస్తుంది.
-ఆదాయపు పన్ను మినహాయింపునకు వర్తించే పొదుపు మొత్తాలపై ఇప్పుడున్న లక్ష రూపాయల పన్ను మినహాయింపు పరిమితిని రూ.3 లక్షలకు పెంచుతారు.
-దీర్ఘకాలిక పొదుపును కోసం ఖాతాల్లోంచి తీసుకునే సొమ్ముపై పన్ను కట్టాల్సి ఉంటుందని కోడ్ ప్రతిపాదించింది.
-పన్ను ఎగవేతకు వ్యతిరేకంగా ‘యాంటీ అవాయిడెన్స్ రూల్’ నుకూడా ప్రవేశపెట్టాలని కోడ్ సూచించింది.
-కార్పొరేట్ పన్ను రేటు ఇప్పుడున్న 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గుతుంది.
-50 కోట్ల రూపాయలపై సంపద పన్ను విధిస్తారు.
Pages: -1- 2 News Posted: 12 August, 2009
|