ఇలానే జరిగింది హైదరాబాద్ : డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పర్యటించిన హెలికాప్టర్ ప్రమాదానికి గురైన సంఘటనపై రకరకాల వార్తాకథనాలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఒక సమగ్ర ప్రకటనను విడుదల చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
హెలికాప్టర్ భద్రతకు సాయుధ బలగాల కాపలా లేదన్నది వాస్తవం కాదు, ఐదుగురు సిటీ ఆర్మ్ డ్ రిజర్వు పోలీసులు హెలికాప్టర్ కు కాపలాగా ఉంటున్నారు. ఈ ఏర్పాటు గత పదేళ్ళుగా కొనసాగుతోంది.
ఆగస్టు 31వ తేదీ ఉదయం 11.30 గంటలకు పైలట్ లకు ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ కార్పొరేషన్ టూర్ ప్రోగ్రాం గురించి సమాచారం అందించారు. అదే సమాచారాన్ని మెయింటెనెన్స్ విభాగానికీ తెలియజేశారు. బెల్-430 హెలికాప్టర్ మెయింటెనెన్స్ ఇంజనీర్ దానిని పరీక్షించి పర్యటనకు అన్ని విధాలా సమర్ధంగా ఉందని సిఆర్ఎస్- సర్టిఫికేట్ ఆఫ్ రిలీజ్ టు సర్వీసును విడుదల చేశారు. రేడియో ఎక్విప్ మెంట్ అంటు ఇఎల్ టి, సివిఆర్ వంటి వాటికి కూడా ఈ ఏడాది డిసెంబర్ 5వ తేదీ వరకూ సిఆర్ ఎస్ విడుదల చేశారు. బెల్-430 హెలికాప్టర్ మెయింటైన్ చేసిందేనని, మంచి కండిషన్ లో ఉందని, డిజిసిఎకు సంబంధించి అన్ని అనుమతులు పొందిందని ఏ క్షణమైనా ప్రయాణానికి అనుకూలమేనని నిర్ధారించారు. ఈ పరిశీలనలన్నీ బాగా అనుభవమున్న నిపుణులతో జరిగినవే.
Pages: 1 -2- -3- -4- News Posted: 9 September, 2009
|